సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల బ్రాండ్ లపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు ముఖ్య మంత్రులుగా పని చేసిన వారికి ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది, తనకి కూడా ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది, తన బ్రాండ్ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ నెట్టింట సంచలనంగా మారాయి.
మంచి రేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి.. కిలో బియ్యం రెండు రూపాయలకే పథకం ప్రారంభించిన ఘనత ఎన్టీఆర్ ది అని, అలాగే ఐటి ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబు ది, ఆరోగ్యశ్రీ అంటే గుర్తుకు వచ్చేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇలా ఒక్కో సీఎం కి ఒక్కో బ్రాండ్ ఉంది, నా బ్రాండ్ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అంటే నేనే గుర్తుకువస్తాను..
కానీ కొంతమంది తెలంగాణ ఉద్యమం తామే చేశామని పేర్లు వేసుకుంటారు, గొప్పలు చెప్పుకుంటారు అంటూ కేసీఆర్, కేటీఆర్ లపై రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఇండైరెక్ట్ గా సెటైర్స్ వేశారు.