ఈమధ్య కాలంలో తల అజిత్ సినిమాలు వస్తున్నాయంటే తమిళనాడులో క్రేజ్ ఉంటుందేమో కానీ ఇతర రాష్ట్రాల్లో అజిత్ మార్కెట్ పడిపోయింది. అజిత్ నామ్ కె వాస్త్ అంటూ సినిమాలు చెయ్యడమే కానీ దాని ప్రమోషన్స్ పట్టించుకోరు, కొంతకాలంగా అజిత్ సినిమాలు చూస్తుంటే ఆయన స్క్రిప్ట్ లు, కథలు కూడావిందాం మానేసారేమో అనిపిస్తుంది. టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి వారు తమిళ ఇండస్ట్రీకి ఎంటర్ అవుతూ అజిత్ - త్రిష జంటగా తమిళ దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కించిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఎలాంటి అంచనాలు లేకుండా నేడు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలైంది.
ఇప్పటికే ఓవర్సీస్ షోస్ కంప్లీట్ అవడంతో అందరూ సోషల్ మీడియాలో గుడ్ బ్యాడ్ అగ్లీ టాక్ కోసం వెతికేస్తున్నారు. అజిత్ ఈసారైనా హిట్ కొట్టారా అంటూ తెగ ఆత్రుత పడిపోతున్నారు. మరి గుడ్ బ్యాడ్ అగ్లీ ఓవర్సీస్ టాక్ లోకి వెళితే.. అజిత్ ఇంట్రో వేరే లెవెల్, అజిత్ ఎంట్రీ చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే, గాడ్ బ్లెస్ యూ పాటతో థియేటర్ దద్దరిల్లింది, ఫస్టాఫ్ సూపర్‌గా ఉంది.. అంటూ ఓ ఆడియెన్ ట్వీట్ చేసారు.
ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయింది. హీరో విశాల్, ఎస్‌జే సూర్య గెస్ట్ రోల్స్ స్క్రీన్ పై కనిపించగానే విజిల్స్ పడడం ఖాయమంటూ మరో నెటిజెన్ ట్వీట్ చేసాడు. అజిత్ వింటేజ్ మళ్లీ కనిపించింది. స్క్రీన్ ప్రజెన్స్, లుక్ బాగుంది. ఇంటర్వెల్ సీన్లకు జీవీ ప్రకాశ్ ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. దర్శకుడు అధిక్ ఈ సినిమాను ఎక్ట్రార్డినరీగా తీశాడు.
సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అద్దిరిపోయినా.. ఆ తర్వాత కథ నెమ్మదించడం ఆడియన్స్ కు బోర్. ఎమోషన్స్ వర్కౌట్ అవ్వలేదు, జీవీ ప్రకాశ్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్‌గా ఉన్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయంటూ మరో నెటిజెన్ ట్వీట్ చేసాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ లో అజిత్ ఫ్యాన్ ను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు ఫస్ట్ హాఫ్ డిజైన్ చేసాడు, అది బాగా వర్కౌట్ అయ్యింది అంటూ మరో ఆడియన్ స్పందించాడు. మరి ఓవర్సీస్ టాక్ ఇలా ఉంటే అసలు రివ్యూ ఎలా ఉంటుందో మరి కాసేపట్లో..