జగన్ మీరు తప్పు చేస్తున్నారు, ఇది మేమన్నది కాదు.. స్వయానా జగన్ మోహన్ రెడ్డి పెంచి పోషించిన బ్లూ మీడియానే. అవును బ్లూ మీడియా జగన్ మీరు తప్పు చేస్తున్నారంటూ కథనాలు ప్రసారం చేస్తుంది. కారణం జగన్ సీఎం గా ఉన్నప్పుడు, ఓడిపోయాక కూడా ప్రజలను, కార్యకర్తలను పట్టించుకోవడం లేదు. నెలకో, ఆర్నెల్లకో జనాల్లోకి వస్తే ఇలానే ఉంటుంది అంటూ నిన్న జరిగిన హెలికాఫ్టర్ ఘటనను ఎత్తి చూపుతుంది.
జగన్ ఓడిపోయాక కూడా దానికి గల కారణాలను విశ్లేషించుకోకుండా కార్యకర్తలను పట్టించుకోవడం లేదు, అప్పుడప్పుడు ఇలా బయటికొస్తే జగన్ పైకి దూసుకు రాక ఏం చేస్తారో అంటూ జగన్ ని మేలుకొలుపుతుంది బ్లూ మీడియా. జగన్ నిన్న హెలికాఫ్టర్ దగ్గరకు రాగానే కార్యకర్తలు చుట్టుముట్టారు.
జగన్ ను నడవనివ్వకుండా షేక్ హాండ్స్ ఇచ్చేందుకు ఉత్సాహం చూపడం, తోసుకోవడంతో హెలీకాఫ్టర్ ను వదిలి జగన్ రోడ్డు మార్గాన బెంగుళూరుకు వెళ్లాల్సి వచ్చింది. దానికి కారణం జగన్ తరచూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటే ఇలాంటి సంఘటనలు జరగవు, నామ్ కే వస్త్ అంటూ అప్పుడప్పుడు వస్తే ఇలానే ఉంటుంది పరిస్థితి. ఇప్పటికైనా జగన్ జనంలోకి, కార్యకర్తల్లోకి రావాలని బ్లూ మీడియా జగన్ కి చెబుతుంది.
జగన్ కార్యకర్తలను విస్మరించకుండా వారిని కలుస్తూ ఉంటే మళ్లీ అధికారంలోకి వస్తారు, కాదు నేను ఇలానే ఉంటానంటే ఆఖరికి ఆ ప్రతిపక్ష హోదా కూడా దక్కదని బ్లూ మీడియా ఓపెన్ గానే మాట్లాడుతుంది.