పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ నిన్న సింగపూర్ స్కూల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దానితో పవన్ ఆయన అన్న మెగాస్టార్ చిరు సింగపూర్ కి వెళ్లారు. పెద్దకడుకు అకీరా బర్త్ డే రోజునే చిన్న కొడుకుకి ప్రమాదం జరగడం పై పవన్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం సింగపూర్ లోని ఆసుపత్రిలో మార్క్ శంకర్ చికిత్స కొనసాగుతోంది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్ళిన పవన్ కల్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు.
మార్క్ ను చూశారు. చేతులు, కాళ్ళకు కాలిన గాయాలు కావడంతోపాటు ఊపిరితిత్తులకు పొగ చూరడంతో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. చిరు ఇంకా పవన్ అక్కడి వైద్యులు, అధికారులతో మాట్లాడారు. మార్క్ కోలుకొంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని వైద్యులు చెప్పినట్టుగా తెలుస్తోంది.
బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి గదికి తీసుకువచ్చారు. మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలియచేశారు.