విశ్వంభర విషయం వదిలేసి అనిల్ రావిపూడి తో మెగాస్టార్ చిరంజీవి కమిట్ అయిన చిత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం మెగా ఫ్యాన్స్ ని ఓ పక్క ఆనందానికి మరోపక్క ఆందోళనకు గురి చేస్తుంది. అనిల్ రావిపూడి చిరుతో ఇంకా రెగ్యులర్ షూట్ కి వెళ్లకముందే Chiru-Anil చిత్రంపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేస్తున్నాడు, ఓపెనింగ్ తోనే అందరి చూపు తమ ప్రాజెక్ట్ పై ఉండేలా చేసాడు.
అసలు విశ్వంభర రిలీజ్ తేదీ పై చిరు పట్టించుకోవడం లేదా, విశ్వంభర విడుదల తేదీ అనౌన్స్ చెయ్యడానికి ఎందుకింత అలసత్వం, ఉగాది, శ్రీరామనవమీ ఫెస్టివల్స్ వెళ్లిపోయాయి. కానీ విశ్వంభర విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు. సమ్మర్ ని వసిష్ఠ వదిలేసాడు, ఆ విషయం అర్ధమవుతుంది.
ఇప్పుడు తాజాగా విశ్వంభర కి సంబందించిన ఓ అప్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విశ్వంభర రిలీజ్ తేదీపై డిస్కర్షన్స్ జరుగుతున్నాయని, జులై 24 న విశ్వంభర విడుదల చేస్తే బావుంటుంది అని, ఆ రిలీజ్ డేట్ ని ఏప్రిల్ 12 న విశ్వంభర ఫస్ట్ సింగల్ తో ప్రకటించేస్తే ఎలా ఉంటుంది అని మేకర్స్ ఆలోచన చేస్తున్నారట.
జులై 24 అంటే మెగాస్టార్ చిరు ఇంద్ర రిలీజై సెన్సేషనల్ హిట్ అయిన రోజు. ఆ రోజు విశ్వంభర రిలీజ్ చేస్తే అద్దిరిపోతుంది అని మేకర్స్ ఆ డేట్ పై కన్నేసినట్లుగా తెలుస్తోంది.