మారిన రూపంతో కరణ్ జోహార్ షాకిచ్చాడు. అతడి కొత్త రూపం ఆశ్చర్యపోయేలా చేసింది. అతడు పూర్తిగా బక్క చిక్కాడు. గుబులు గుబులుగా కనిపించాడు. కళ్లద్దం పెట్టాడు కానీ, ముఖంలో కళ తప్పింది. బట్ట తల స్పష్ఠంగా కనిపిస్తోంది. బుగ్గలు లోతుగా లాగేసి వికారంగా కనిపించాడు.
మొన్నటివరకూ టింగురంగడిలా ఇస్మార్ట్ లుక్ లో కనిపించిన కరణ్ ఉన్నట్టుండి ఇలా బక్క చిక్కాడేమిటీ? అతడికి ఏమైంది? ఆరోగ్యం బాగానే ఉందా? ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తిందా? అంటూ అందరూ సందేహాల్ని వ్యక్తం చేస్తున్నారు. అతడి రూపం చూడగానే నెటిజనులు రకరకాలుగా ఊహిస్తున్నారు.
ఇది కేవలం ప్రచార జిమ్మిక్ అని కొందరు కొట్టి పారేస్తుంటే, లేదు అతడికి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి.. చాలా జాగ్రత్తగా జీవించాలి ఇకపై! అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అతడికి కావాల్సినన్ని సౌకర్యాలు ఉన్నాయి. సౌకర్యాలతో అద్భుతమైన జీవన శైలి ఉంది. ఆరోగ్యంగానే ఉన్నారని అన్నారు. అయితే అసలు వాస్తవాలు ఏమిటన్నది కరణ్ స్వయంగా చెప్పాల్సి ఉంది. అతడు ఆరోగ్యంగా ఉన్నాడా లేదా? అనేది ఇంకా ధృవీకరించాల్సి ఉంది.
ఇటీవలే తన కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ నుంచి మెజారిటీ షేర్స్ ని అమ్మేశాడు. ఇకపై పెద్ద సినిమాలు తీయనని ఖరాకండిగా చెప్పేశాడు. 80-90కోట్ల బడ్జెట్ సినిమాలు మాత్రమే తాను నిర్మిస్తానని అన్నాడు. కొన్నేళ్లుగా ఫ్లాపుల్ని ఎదుర్కొంటున్న ధర్మ ప్రొడక్షన్స్ ని వేరొక బడా కంపెనీతో మెర్జ్ చేసేసి ఇప్పుడు కొంత రిలాక్స్ డ్ గా ఉన్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం, తదుపరి ప్రాజెక్టుల గురించి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.