అల్లు అర్జున్ వైఫ్ స్నేహ రెడ్డి కి సోషల్ మీడియాలో అందులోనూ ఇన్ స్టా లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. హీరోయిన్స్ కి తీసిపోని గ్లామర్ తో స్నేహ రెడ్డి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పక్కన కనిపిస్తుంది. రీసెంట్ గా స్నేహ రెడ్డి తన కొడుకు అయాన్, కుమార్తె అర్హ లను తీసుకుని ముంబై వెళ్ళింది
దాంతో అందరూ అల్లు అర్జున్ ముంబై లో ఏప్రిల్ 8 న తన బర్త్ డే ని సెలెబ్రేట్ చేసుకోబోతున్నారు, అందుకే స్నేహ పిల్లలని తీసుకుని ముంబై వెళ్ళింది అంటున్నారు. అదలావుంటే తాజాగా స్నేహ రెడ్డి ఇన్ స్టా లో పెట్టిన ఓ పోస్ట్ అల్లు అభిమానులు ఆందోళన పడేలా చేసింది. స్నేహ తన ఇన్ స్టా స్టోరీస్ లో ఒక అమ్మాయి హాస్పిటల్ బెడ్ పై ఉన్న పిక్ షేర్ చేసింది.
హాస్పిటల్ లో ఓ అమ్మాయికి రక్తం ఎక్కిస్తుండగా, ఆ బ్లడ్ ప్యాకెట్ పై ట్రావెల్ అని రాసి ఉంది. ఆ పిక్ ని షేర్ చేస్తూ నాకు ప్రస్తుతం ఏం కావాలంటే.. అంటూ క్యాప్షన్ పెట్టింది. స్నేహ ఇన్స్టా పోస్ట్ అర్ధం కాకపోయినా, ఆమెకి ఏమైందో ఇలాంటి పోస్ట్ పెట్టింది అని అల్లు అభిమానులు టెన్షన్ పడుతున్నారు.