పిఠాపురంలో కావాలని వర్మతో నాగబాబు విరోధం పెట్టుకున్నారా అనిపించేలా అక్కడి పరిస్థితిలు కనబడుతున్నాయి. పిఠాపురంలో పవన్ గెలుపు కోసం పని చేసిన వర్మ ను నాగబాబు పక్కనపెట్టడం, జనసైనికులు సైతం వర్మను తీసిపారెయ్యడం వర్మ అనుచరులకు, టీడీపీ పిఠాపురం కార్యకర్తలకు నచ్చడం లేదు, కాబట్టే నాగబాబు ని పిఠాపురం నియోజకవర్గంలో తిరగనివ్వడం లేదు.
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంతగా స్నేహంగా ఉంటున్నారో ప్రతిసారి చూపిస్తున్నారు. పవన్ మొహమాటం లేకుండా చంద్రబాబు కి మద్దతు గా నిలబెట్టే గెలిచాను, నేను చంద్రబాబు కింద పని చెయ్యడానికి సిగ్గు పడను అని చెబుతున్నా జనసైనికులు మాత్రం ఆ విషయం పెడచెవిన పెట్టి పిఠాపురంలో రెచ్చిపోతున్నారు, కారణం నాగబాబు ఇస్తున్న అలుసే అని చెప్పుకుంటున్నారు.
నాగబాబు కూడా చూసి చూడకుండా పోవాలి కానీ.. వర్మను, అనుచరులను రెచ్చగొట్టే పనులు మానుకును సమన్వయంగా కలుపుకొప్తే కూటమికి ముఖ్యంగా వర్మకు నాగబాబు కి మంచిది, లేదంటే ప్రతిపక్షం గా చెప్పుకునే వైసీపీ కి లోకువ. సర్దుకుపోతే ఇద్దరికి మంచిది అనే అభిప్రాయాలను రాజకీయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో పవన్ ఏం చేస్తారో చూడాలి.