నాని నిర్మాతగా ప్రియదర్శి కీలక పాత్రలో తెరకెక్కిన కోర్ట్ చిత్రం గత నెల మార్చి లో విడుదలై థియేటర్స్ లో మంచి హిట్ అయ్యింది. కోర్ట్ ఓటీటీ కంటెంట్ అన్నప్పటికి థియేటర్స్ లో ఈ చిత్రం నానికి లాభాలు తెచ్చిపెట్టింది. కోర్ట్ చిత్రం హిట్ అవడంతో 50 కోట్ల క్లబ్బులోకి నాని నిర్మాతగా అలవోకగా అడుగుపెట్టాడు.
థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన కోర్ట్ చిత్ర ఓటీటీ డేట్ పై ఫ్యామిలీ ఆడియన్స్ లో చాలా క్యూరియాసిటీ మొదలైంది. కోర్ట్ చిత్ర డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది.
ఇప్పుడు కోర్ట్ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్ లోకి తేబోతున్నట్టుగా ప్రకటించింది. థియేటర్స్ లో మిస్ అయిన ఆడియన్స్ కోర్ట్ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ వేదికగా ఏప్రిల్ 11 నుంచి ఇంట్లోనే కూర్చుని వీక్షించేయ్యండి.