ఏప్రిల్ 8 సోషల్ మీడియా మోత మోగిపోతుందేమో. ఎదుకంటే అల్లు vs అక్కినేని ఫ్యాన్స్ ఇద్దరూ సోషల్ మీడియాని ఆక్యుపై చెయ్యడానికి సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ 8 న ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోల బర్త్ డే లు. అందులో ఒకరు పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్. మరొకరు అఖిల్.
అల్లు అర్జున్ నుంచి ఏప్రిల్ 8 న షాకింగ్ అప్ డేట్స్ రాబోతున్నట్టుగా అల్లు అర్జున్ నిర్మాత ప్రకటించారు. అదే రోజు అంటే అదే ఏప్రిల్ 8 కి అక్కినేని ప్రిన్స్ అఖిల్ నటిస్తున్న #Akhil6 నుంచి బిగ్ అప్ డేట్ కాదు పవర్ ఫుల్ అప్ డేట్ రాబోతున్నట్టుగా #Akhil6 నిర్మాత ప్రకటించారు. అసలే రెండేళ్లుగా అక్కినేని అభిమానులు అఖిల్ నెక్స్ట్ అప్ డేట్ పై ఆకలిగా ఉన్నారు. అఖిల్ బర్త్ డే కి రాబోతున్న #Akhil 6 అప్ డేట్ రావడమే ట్రెండ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
మరి పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అద్దరగొట్టే విజయాలతో నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేస్తున్నారు. అల్లు ఫ్యాన్స్ ఊరుకుంటారా, సోషల్ మీడియా వేదికగా #AA 22 ని ట్రెండ్ చెయ్యడానికి హాలీవుడ్ రేంజ్ లో స్కెచ్ వేస్తున్నారు. సో ఏప్రిల్ 8 మాత్రం సోషల్ మీడియా మొత్తం మోత మోగిపోవడం ఖాయంగా కనబడుతుంది వ్యవహారం.