తమన్నా ఏప్రిల్ 17 న ఓదెల 2 తో పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఓదెల 2 ముందు ఎలా ఉన్నా చిత్ర టీజర్ వచ్చాక ఒక్కసారిగా ఈ చిత్రంపై అందరిలో విపరీతమైన ఆసక్తి మొదలైంది. తమన్నా ఇప్పటికే ఓదెల 2 ప్రమోషన్స్ ని మొదలు పెట్టేసింది. ఇంటర్వూస్, అలాగే ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ లో తమన్నా సందడి చేస్తుంది.
మరి ఓదెల 2 ప్రమోషన్స్ లో తమన్నా తన బ్రేకప్ ప్రశ్నలను ఎలా ఫేస్ చేస్తుందో అనేది ఆమె అభిమానులను తొలిచేస్తోంది. ప్రెస్ మీట్ కానీ, లేదంటే మీడియాకి క్వచ్చన్ అండ్ ఆన్సర్ మీట్ కానీ పెడితే ఖచ్చితంగా తమన్నాకు తన బ్రేకప్ పై ప్రశ్నలు ఎదురవ్వడం ఖాయం.
విజయ్ వర్మతో రీసెంట్ గానే బ్రేకప్ చేసుకున్న తమన్నా ఇప్పటివరకు మీడియాను ఎదుర్కొనలేదు, విజయ్ వర్మ తో బ్రేకప్ ప్రశ్నలను తమన్నా ఎలా ఫేస్ చేస్తుందో అనేది చూడాలి. ఈ నెల 8 న ముంబై వేదికగా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగబోతుంది. ఓదెల 2 ప్రమోషన్స్ కోసం తమన్నా త్వరలోనే టాలీవుడ్ మీడియా ముందుకు రాబోతుంది.