సమ్మర్ హీట్ అంతకంతకు రాజుకుంటోంది. దీంతో ఒంటరి దీవులు కిటకిటలాడుతున్నాయి. కరోనా మహమ్మారీ వెళ్లాక టూరిజానికి ఇది పెద్ద ఊరట. అయితే చాలా మంది సెలబ్రిటీలు మాల్దీవులకు వెళుతుంటారు. గోవా, ఫిజీ, అండమాన్ లాంటి ఎగ్జోటిక్ దీవులను ఆస్వాధిస్తారు. ఒంటరి దీవుల్లో ప్రకృతి అందాలను జలపాతలను ఆస్వాధిస్తూ, ఫ్యాన్స్ కి బికినీ ట్రీట్ ఇవ్వడానికి వెనకాడరు. బికినీలు, స్విమ్ సూట్లతో బీచ్ విహారంలో హద్దులు చెరిపేసి వీనులవిందును అందిస్తారు.
కానీ ఈ అమ్మడి రూటే సపరేటు! ఈ భామ ఎవరికీ చెప్పకుండా బ్యాంకాక్ వెళ్లింది. అక్కడ ఒంటరి దీవుల్లో నచ్చినట్టు ఎంజాయ్ చేస్తోంది. అయితే తనతో పాటు విహార యాత్రలో ఎవరున్నారో బయటపడనివ్వడం లేదు. అక్కడి నుంచి లైవ్ గా కొన్ని ఫోటోలను పంపించింది ఈ బ్యూటీ. కానీ వాటిలో ప్రియుడి జాడ కనిపించలేదు. అసలు ఎందుకిలా రహస్యాన్ని మెయింటెయిన్ చేస్తోంది? తనతో ఒంటరి దీవిలో ఉన్నది ఎవరో చెప్పకుండా దాచేయడం దేనికి?
అయినా గోవా, మాల్దీవులను కాదని బ్యాంకాక్ కి విహార యాత్రకు ఎందుకు వెళ్లినట్టు? అంటూ రకరకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజనం. అయినా వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో ఒకరిని ప్రశ్నించకూడదు. యాత్రలు ఎవరి ఇష్టం వారిది. కానీ తన ప్రియుడు ఎవరు? అన్నది చెబితే తప్పేంటి? అని ప్రశ్నిస్తున్నారు. ఒకసారి నిశ్చితార్థం అయ్యి, పెళ్లి క్యాన్సిల్ అయిన నటి తన రహస్యాలను మాత్రం బయటపడనివ్వడం లేదని గుసగుసలాడుతున్నారు. ఇంతకీ ఎవరా నటి గెస్ చేయగలరా?