సినిమా సెలెబ్రిటీస్ ని ఆరాధించే అభిమానులు వారిని దగ్గరగా చూడాలని, కనిపిస్తే సెల్ఫీ తీసుకోవాలని తెగ ఉవ్విళ్లూరుతారు, అందుకే వారు ఏ షాప్ ఓపెనింగ్ లో కనబడినా ఆరాటంతో మీద పడిపోతారు. తాజాగా బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీలకు చుట్టూ తనని రక్షించే బౌన్సర్లు ఉన్నా ఆమె ఆకతాయిల వేధింపులకు గురవడం హాట్ టాపిక్ అయ్యింది.
శ్రీలీల హిందీలో కార్తీక్ ఆర్యన్ హీరోగా ఓ లవ్ స్టోరీలో నటిస్తుంది. ఆ చిత్రానికి సంబందించిన షూటింగ్ డార్జిలింగ్ లో జరుగుతుంది. అక్కడ షూటింగ్ అవ్వగానే బయటకొచ్చిన కార్తీక్ ఆర్యన్, శ్రీలీలను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు, కార్తీక్ ఆర్యన్ అందరికి విష్ చేస్తూ నడుస్తుండగా.. శ్రీలలను కొందరు ఆకతాయిలు బౌన్సర్లు ఉన్నా లెక్క చెయ్యకుండా చెయ్యి పట్టుకుని లాగేసారు.
ఆకతాయిల అలా చెయ్యడంతో శ్రీలీలకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది, ఇది గమనించని కార్తీక్ ఆర్యన్ అక్కడి నుంచి వెళ్లిపోవడం శ్రీలీల అభిమానులకు కోపం తెప్పించింది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడం చూసిన శ్రీలీల అభిమానులు తెగ ఫీలవుతున్నాను. నటులంటే అంత చులకనా, లేదంటే ఇలాంటి పనులు ఏమిటి అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.