అల్లు అర్జున్ బర్త్ డే కి ఓ బిగ్ స్పెషల్ షాకింగ్ సర్ ప్రైజ్ రాబోతున్నట్టుగా గీత ఆర్ట్స్ నిర్మాత బన్నీ వాస్ బీ రెడీ అంటూ ఇచ్చిన అప్ డేట్ పై అల్లు ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలు పెరిగిపోతున్నాయి. మరో రెండు రోజుల్లో అల్లు అర్జున్ కొత్త సినిమా అప్ డేట్ ఎలా ఉండబోతుంది, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ.. అల్లు అర్జున్ మూవీని ఎలా అనౌన్స్ చేస్తారానే అతృతతో అల్లు అభిమానులు ఉన్నారు.
అల్లు అర్జున్-అట్లీ కాంబో మూవీ ఎనౌన్సమెంట్ ని ఓ స్పెషల్ వీడియో తో ప్రకటిస్తారనే ప్రచారం ఉంది. విదేశాల్లో అల్లు అర్జున్-అట్లీ మూవీ కి సంబందించిన స్పెషల్ వీడియో ని షూట్ చేశారట. ఇప్పుడు అదే వీడియో తో ఏప్రిల్ 8 న బన్నీ బర్త్ డే కి అల్లు అర్జున్-అట్లీ అనౌన్సమెంట్ రాబోతుంది.
మరా స్పెషల్ వీడియో ఎలా అంటుంది, అట్లీ అల్లు అర్జున్ ని ఎలా ప్రెజెంట్ చేస్తారు, అనౌన్సమెంట్ వీడియోతోనే అల్లు అర్జున్-అట్లీ మూవీ సెన్సేషన్ క్రియేట్ చెయ్యడం ఖాయమంటూ అల్లు ఫ్యాన్స్ సంబరాలు చేసుకోవడానికి తయారవుతున్నారు.