Advertisement
Google Ads BL

శ్రద్ద కపూర్ పై డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు


బాలీవుడ్ లో స్త్రీ 2 తో తెగ ఫేమస్ కాదు క్రేజీ హీరోయిన్ గా మారిన శ్రద్ద కపూర్ పై బాలీవుడ్ నిర్మాత దినేశ్ విజయ్, దర్శకుడు అమర్ కౌశిక్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి, శ్రద్ద కపూర్ దెయ్యంలా నవ్వుతోంది, అందుకే స్త్రీ 2 అవకాశం దక్కింది అంటూ అమర్ కౌశిక్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై శ్రద్ద కపూర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

స్త్రీ 2లో శ్రద్ద కపూర్ హీరోయిన్ గా ఎంపిక చెయ్యడానికి కారణం ఆమె నవ్వే, ఆమె దెయ్యంలా నవ్వుతుంది, అందుకే స్త్రీ 2 కి మరో చాయిస్ లేకుండా శ్రద్ద కపూర్ ని తీసుకున్నాం అంటూ స్త్రీ 2 డైరెక్టర్ అమర్ కౌశిక్ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. స్త్రీ 2 కోసం హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చెయ్యాలా అని ఆలోచిస్తున్న సమయంలో దినేష్ తనకు శ్రద్ద కపూర్ పేరు సూచించారు.  

దానికి కారణం ఒకేసారి శ్రద్ధాకపూర్‌, దినేశ్‌ విజయ్ ఒకే ఫ్లైట్‌లో ప్రయాణించారని, ఆ సమయంలో జరిగిన సంభాషణలో శ్రద్ధ అచ్చం దెయ్యంలా నవ్వుతుందని, అందుకే స్త్రీ 2లో పాత్రకు శ్రద్ధనే పూర్తి న్యాయం చేయగలదని దినేశ్ విజయ్ తనతో చెప్పారని అమర్ కౌశిక్ చెప్పుకొచ్చారు. 

Shraddha Kapoor Fans ANGRY Over Dinesh Vijan :

Stree Director Comment on Shraddha Kapoor Angers Fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs