ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టిన రోజు, గత ఎడాది పుష్ప ద రూల్ తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టిన అల్లు అర్జున్ కి ఈ బర్త్ డే ఎంత స్పెషల్ అనేది తెలియదు కానీ, ఆయన అభిమానులకు మాత్రం వెరీ వెరీ స్పెషల్ అని చెప్పాలి, కారణం అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తారు.
అసలే త్రివిక్రమ్ తో అల్లు అర్జున్, అట్లీ-అల్లు అర్జున్ ఏ ప్రాజెక్ట్ ముందు పట్టాలెక్కుతుందో అర్ధం కాక అభిమానులు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. తాజాగా గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి ఓ స్పెషల్ ట్వీట్ వచ్చింది. ప్రొడ్యూసర్ బన్నీ వాస్ ఏప్రిల్ 8 న స్పెషల్ కాదు షాకింగ్ సర్ప్రైజ్ రాబోతున్నట్టుగా ట్వీట్ వేశారు.
మరి అల్లు అర్జున్ తన బర్త్ డే సందర్భంగా అంతలా షాకిచ్చే సర్ ప్రైజ్ ఏమివ్వబోతున్నారో అని అల్లు అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు, అల్లు అర్జున్.. త్రివిక్రం, అట్లీ ప్రాజెక్ట్స్ కాకుండా ఇంకేమైనా స్పెషల్ న్యూస్ ఇచ్చి షాకిస్తారా అంటూ అప్పుడే ఊహాగానాలు మొదలు పెట్టేసారు అల్లు ఫ్యాన్స్ .