రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేసి దారుణాతి దారుణంగా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ కి 2024 ఎన్నికలు చాలా ప్రత్యేకం. టీడీపీ, బీజేపీ పార్టీలతో జత కట్టి పిఠాపురం నియోజక వర్గంనుంచి టీడీపీ నేత వర్మ సహాయంతో గెలుపొందిన పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. వర్మ సహాయంతో గెలుపొందిన పవన్ కళ్యాణ్ ఆయనకు అడుగడుగునా కృతజ్ఞతలు తెలియజేసారు.
కానీ నాగబాబు ఎమ్యెల్సీ అయ్యాకా సీన్ రివర్స్ అయ్యింది, నాగబాబు జనసేన కార్యకర్తలతో కలిసి పిఠాపురంలో వర్మను తొక్కే ప్లాన్ చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. జనసేన ఫార్మేషన్ సభలో పిఠాపురంలో తమ గెలుపు కష్టానికి ప్రతిఫలం, ఎవ్వరి అండ లేకుండా గెలిచాము, ఒకవేళ మా సపోర్ట్ ఉంది అని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ అంటూ వర్మను, టీడీపీ పిఠాపురం కేడర్ ని రెచ్చగొట్టారు.
ఇప్పుడు ఎమ్యెల్సీ అయ్యాక పిఠాపురం వెళ్లిన నాగబాబు కి వర్మ అనుచరులు అడుగడుగునా అడ్డు పడుతున్నారు, జనసేన కార్యకర్తలతో గొడవేసుకుని నాగబాబు విషయంలో దూకుడు చూపిస్తున్నారు. నాగబాబు ఎక్కడికెళ్లినా వర్మ అనుచరులు, టీడీపీ అభిమానులు నాగబాబు కి చుక్కలు చూపిస్తున్నారు.
మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యి అన్న నాగబాబు కి ఎలాంటి ప్రోబ్లేం లేకుండా పరిస్థితిని చక్కబెడతారా, లేదంటే నాగబాబు ని చక్కబెట్టుకోమంటారో అని అందరూ చాలా క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు. అసలు పవన్ పిఠాపురంలో ప్రస్తుత పరిస్థితి పై ఎలా రియాక్ట్ అవుతారో అనేది మరింత ఆసక్తిగా మారింది.