ప్రతిభావంతుడైన టీమిండియా ఆటగాడు యజ్వేంద్ర చాహల్ వ్యక్తిగత జీవితం ఇటీవల మీడియాలో రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. అత్యంత అందగత్తె అయిన భార్య ధనశ్రీ నుంచి అతడు విడాకులు తీసుకున్నాడు. అయితే ఈ విడాకులకు కారణం అతడు- ఆమె మధ్య ప్రముఖ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ ఆర్జే మహ్వాష్ ఇన్వాల్వ్ మెంట్ ప్రధాన కారణమని ప్రచారమైంది. ఆ ఇద్దరూ కలిసి కనిపించడంతో డేటింగ్ లో ఉన్నారని ప్రచారమైంది.
అయితే ఇప్పుడు ఈ ప్రచారంపై పూర్తి స్పష్ఠత వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆర్జే మహ్వాష్ తన రిలేషన్ షిప్ స్టాటస్ గురించి అప్ డేట్ చేసింది. తాను ఒంటరిగా ఉన్నానని తెలిపింది. అంతేకాదు.. తనకు 19ఏళ్ల వయసులో నిశ్చితార్థం అయిందని, కానీ అది పెళ్లి దిశగా సాగలేదని చెప్పి పెద్ద షాకిచ్చింది. నిశ్చితార్థం చేసుకున్న వ్యక్తితో రెండేళ్లకు బంధం ముగిసిందని వెల్లడించింది. అప్పటి నుంచి ఎవరితో అయినా డేటింగ్ చేయాలంటే భయపడుతున్నట్టు తెలిపింది. తన స్వస్థలం అలీఘర్ లో ఎవరైనా అన్ని అర్హతలు ఉన్న వ్యక్తిని తాను కలవలేకపోయానని కూడా అంది. పరోక్షంగా మగాళ్లను నమ్మలేనని, పెళ్లి తంతును తలకెక్కించుకోలేనని కూడా మహ్వాష్ నిర్వేదానికి గురైంది. నిశ్చితార్థం తర్వాత మహ్వాష్ మనసు ఎంతగా విరిగిపోయిందో ఈ ఇంటర్వ్యూతో అర్థం చేసుకోవచ్చు.
తనను కచ్ఛితంగా పెళ్లాడే వాడు దొరికితేనే అతడితో డేటింగ్ చేస్తానని, ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను పెళ్లి అనే ఆలోచనను పక్కన పెట్టేశారనని ఆర్జే మహ్వాష్ పేర్కొంది. జీవితంలో ప్రతి ఒక్కరి అంతిమ లక్ష్యం పెళ్లి! అని ముక్తాయించింది! ఆర్జే మహ్వాష్ మాటల్లో డేటింగ్ వ్యవహారం, పెళ్లి మ్యాటర్ లో చేదు జ్ఞాపకాల ప్రభావం తన మనసుపై బలంగా ఉందని అర్థమవుతోంది.