ఎమ్యెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి అన్న మెగాస్టార్-వదిన సురేఖల ఆశీర్వాదం తీసుకుని పిఠాపురం బయలుదేరి వెళ్లిన నాగబాబు అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నాగబాబు ఇప్పటివరకు జనసేన పార్టీ తరపున పని చేస్తే ఇప్పుడు ఎమ్యెల్సీ హోదాలో ప్రజల మధ్యన తిరుగుతున్నారు. అయితే నాగబాబు ఎమ్యెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన ఆనందం ఆవిరయ్యేలా కనబడుతుంది.
కారణం పిఠాపురంలో టీడీపీ నుంచి జనసేనకు నిరసన సెగ మొదలైంది. టీడీపీ వర్మ స్థానంలో నాగబాబు ఉండడం, నాగబాబు తమ గెలుపుకు ర్వరూ కారణం కాదు, ఒకవేళ అనుకుంటే అది వారి ఖర్మ అంటూ వర్మను ఇండైరెక్ట్ గా కించపరచరడం ఇవన్నీ పిఠాపురం టీడీపీ కేడర్ కి ఆగ్రహం కలిగించాయి.
నిన్న పిఠాపురంలో నాగబాబు పర్యటనలో జనసేన, టీడీపీ కార్యకర్తల నడుమ జై టీడీపీ, జై జనసేన నినాదాలతో నాగబాబుకు కాస్త సెగ చూపెట్టారు. మరోపక్క పవన్ వెన్నంటి ఉండే వర్మ నాగబాబు కి ఎలాంటి సపోర్ట్ చెయ్యడం లేదు. ఈరోజు శనివారం పిఠాపురం కుమారపురంలో రెండోరోజు పర్యటిస్తున్న నాగబాబుకు టీడీపీ కేడర్ నుంచి నిరసన సెగ తగిలింది.
నాగబాబు కుమారపురం కార్యక్రమంలో TDP కార్యకర్తలకు, జన సైనికుల కు మధ్య తోపులాట జరిగింది, జై జనసేన అని వారు, జై టీడీపీ అని వర్మ అనుచరులు కేకలు ఎవస్తూ రచ్చ చేసారు, దానితో పరిస్థితి చేయదాటక ముందే నాగబాబు ను పోలీసులు అక్కడి నుంచి పంపించివేశారు. మరి టీడీపీ vs జనసేన అన్నట్టుగా పిఠాపురంలో ముసలం పుట్టినట్లుగానే కనబడుతుంది వ్యవహారం.