యంగ్ టైగర్ ఎన్టీఆర్ సంస్కారం చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నారు. ఎన్టీఆర్ తన కాళ్ళకు దణ్ణం పెట్టబోతున్న మ్యాడ్ స్క్వేర్ దర్శకుడు కళ్యాణ్ శంకర్ ని ఆపి వద్దు ఇలా అయితే నేను వెళ్ళిపోతాను, కాళ్ళకు దణ్ణం పెట్టాలంటే మీ అమ్మ నాన్నకు పెట్టండి అంటూ సున్నితంగా తిరస్కరించిన వీడియో వైరల్ అవుతుంది.
గత రాత్రి మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ బాష్ కి గెస్ట్ గా వెళ్లిన ఎన్టీఆర్ స్టేజ్ ఎక్కగానే అభిమానుల అరుపులు చూసిన దర్శకుడు త్రివిక్రమ్ మీరు జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ అంటుంటే నాకు GAINT అని వినబడుతుంది అంటూ ఆసక్తికరంగా మట్లాడారు, ఎన్టీఆర్ మాట్లాడుతున్నంతసేపు అభిమానులు నినాదాలతో హోరెత్తించారు.
ఇక మ్యాడ్ స్క్వేర్ దర్శకుడు కళ్యాణ్ శంకర్ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతున్నప్పడు కళ్యాణ్ శంకర్ వచ్చి ఎన్టీఆర్ కాళ్ళపై పడబోయాడు, కానీ ఎన్టీఆర్ వెంటనే వెనక్కి వెళ్లి వద్దు ఇలా చెయ్యొద్దు, నేను వెళ్ళిపోతాను, మీరు కాళ్ళకు నమస్కారం పెట్టాలంటే మీ తల్లితండ్రులకు పెట్టమని చెప్పడం చూసిన వారు ఎన్టీఆర్ ఎంత సంస్కారవంతుడో అని కామెంట్ చేస్తున్నారు.