యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకసారి బబ్లీ గా తయారవుతారు, ఒకసారి స్లిమ్ గా కనబడతారు, రాఖి సినిమా సమయంలో ఎన్టీఆర్ బరువు ఆయన్ని హీరో గా సైడ్ చేస్తుందనుకున్నారు, కానీ రాజమౌళి సలహాలతో ఎన్టీఆర్ యమదొంగ గా అందరిని సర్ ప్రైజ్ చేసారు. ఇక రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ లోని భీమ్ పాత్ర కోసం కాస్త వెయిట్ పెరిగిన ఎన్టీఆర్ దేవర చిత్రంలో అదే బరువుని మైంటైన్ చేసారు.
వార్ 2 కొచ్చేసరికి కాస్త ఫిట్ గా కనబడిన ఎన్టీఆర్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ మూవీ కోసం 14 కేజీలేమిటి ఆపైనే బరువు తగ్గడం హాట్ టాపిక్ అయ్యింది. గత రాత్రి మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో గెస్ట్ గా పాల్గొన్న ఎన్టీఆర్ లుక్ విషయంలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. మరీ ఎక్కువ సన్నబడ్డాడు ఎన్టీఆర్, మొహంలో గ్లో లేదు.
అంతేకాదు కలర్ కూడా బాగా తగ్గారు, ప్రశాంత్ నీల్ మూవీ కోసం ఎన్టీఆర్ ఇంతగా తగ్గాలా, ఎన్టీఆర్ బరువు తగ్గి హ్యాండ్ సమ్ గా లేరు, బక్కగా కనిపిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో కనబడుతున్న కామెంట్స్ ఇప్పుడు ఎన్టీఆర్ న్యూ లుక్ పై ఫ్యాన్స్ లో ఆందోళన మొదలయ్యేలా చేసింది.