బాలీవుడ్ అవకాశం వచ్చిందో లేదో శ్రీలీల బాలీవుడ్ హీరోతో డేటింగ్ లో ఉంది అనే వార్తలు గుప్పుమన్నాయి. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో హిందీలోకి ఎంట్రీ ఇస్తున్న శ్రీలీల కార్తీక్ ఆర్యన్ ఫ్యామిలీ ఫంక్షన్ లో కనిపించడమే కాదు, కార్తీక్ తల్లి మాకు ఓ డాక్టర్ కోడలిగా వస్తే బావుంటుంది అనేసరికి అది శ్రీలీల ని ఉద్దేశించి అన్నదే, శ్రీలీల-కార్తీక్ ఆర్యన్ ప్రేమలో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది.
తాజాగా ఇన్స్టా లైవ్ లో శ్రీలీల అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. తనని తన తల్లి జాగ్రత్తగా దగ్గరుండి మరీ చూసుకుంటుంది అని, తనకు కావాల్సిన ఏ విషయమైనా తన తల్లే చూసుకుంటారని చెప్పిన శ్రీలీల పరీక్షలు రాసే విద్యార్థులకు మంచి టిప్స్ ఇచ్చింది.
పరీక్షల సమయంలో సోషల్ మీడియాకి దూరంగా ఉండండి, రివిజన్ ఎక్కువగా చెయ్యండి, పాత పేపర్స్ చదవండి, చాట్ జిపిటి సలహాలు తీసుకోమని చెప్పిన శ్రీలీల ప్రేమపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మీరు ప్రేమను పొందుతున్నామనిపిస్తే అది గాలి కూడా చొరబడనంతగా గట్టిగా పట్టుకోండి, అంటే ప్రేమలో పడ్డామని తెలిస్తే దానిని వదలొద్దని శ్రీలీల చెబుతుంది.