Advertisement
Google Ads BL

ఫ్యాన్స్ దగ్గర నాగవంశీని ఇరికించిన ఎన్టీఆర్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాన్నాళ్లకు పబ్లిక్ లోకి వచ్చారు. ఫ్యాన్స్ ముందుకు కొన్నాళ్లుగా రాని ఎన్టీఆర్ ఇప్పుడు బావమరిది నార్నె నితిన్ మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ సెలెబ్రేషన్స్ కోసం ఫ్యాన్స్ ముందుకు వచ్చారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన ఈవెంట్ లో ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. 

Advertisement
CJ Advs

మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్ లో చాలా స్టైలిష్ గా కనిపించిన ఎన్టీఆర్ ఆ చిత్ర టీం కి కంగ్రాట్స్ చెప్పడమే కాదు తన సినిమాల అప్ డేట్స్ కూడా  పంచుకున్నారు, దేవర 2 ఉంటుంది దానికి కాస్త గ్యాపిచ్చాం. మధ్యలోకి ప్రశాంత్ నీల్ వచ్చేసాడు అంటూ సరదాగా మాట్లాడిన ఎన్టీఆర్ నాగవంశీ తో సినిమా చేయ్యబోతున్నట్లుగా కన్ ఫర్మ్ చేసారు. 

అంతేకాదు మ్యాడ్ స్వేర్ చూసాక కామెడీ చెయ్యడం చాలా కష్టం. అందుకే నేను అదుర్స్ 2 చెయ్యడానికి భయపడుతున్నాను అంటూ ఎన్టీఆర్ అదుర్స్2 పై కామెంట్స్ చేసారు. ఇక తన ఫ్యాన్స్ ని నాగవంశీ హ్యాండిల్ చేస్తాడు, నువ్వు నా సినిమా సమర్పించడం కాదు, నిర్మాతగా నీ పేరు వేస్తారు, త్వరలోనే నువ్వు ఆ అప్ డేట్ ఇద్దువుగాని, అప్పుడు నా ఫ్యాన్స్ రచ్చని నీకు అప్పజెబుతాను, నువ్వే వాళ్ళను హ్యాండిల్ చెయ్యాలి, నువ్వే వాళ్లతో మాట్లాడుకోవాలి, మధ్యలోకి నేను రాను అంటూ తన ఫ్యాన్స్ దగ్గర సరదాగా నిర్మాత నాగవంశీని ఇరికించేశారు ఎన్టీఆర్. 

NTR crazy update on upcoming movies:

Jr NTR Mass and Fun Loaded Speech at Mad Square event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs