అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం క్రేజీ కేరెక్టర్ నటి, ఆమె నటించే సినిమాలన్ని ఏంతో ప్రత్యేకమైనవి, పాన్ ఇండియా కథలకు కూడా అనసూయ భరద్వాజ్ ని ఎంచుకుంటున్నారు అంటే ఆమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లేదు, ఏజ్ తో పని లేదు, బరువుతో మనకేంటి అన్నట్టుగా అనసూయ అందాల ఆరబోత ఉంటుంది.
నిన్న గురువారం బ్లూ శారీ లో బ్యాక్ లెస్ బ్లౌజ్ తో మెస్మరైజ్ చేసిన అనసూయ భరద్వాజ్ నేడు శుక్రవారం శ్రీరామనవమి ఈవెంట్ కోసం బెంగాలీ మహిళ అవతారం ఎత్తడమే కాదు, ఆ శారీ లో అనసూయ నిజంగా సూపర్బ్ అనేలా ఉంది. నుదుటున బొట్టు, అర్ద చంద్రాకారంలో చేతులకు పెట్టిన గోరింటాకు తో అనసూయ లుక్ నిజంగా అద్భుతః అనిపించింది.
చేతులకు బంగారు గాజులు, చెవులకి జుంకీలు పెట్టుకుని అనసూయ బెంగాలీ లుక్ లో కేకో కేక అనేలా ఉంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.