Advertisement
Google Ads BL

ఇండియన్ 3 రెడీ అవుతోంది.


ఇండియన్ 2 డిజాస్టర్ తర్వాత ఇండియన్ 3పై అనుమానాలు మొదలయ్యాయి. ఇండియన్ 2 కనీసం యావరేజ్ అయినా ఇండియన్ 3 పై ఎంతో కొంత క్రేజ్ ఉండేది. కానీ ఆ చిత్రం డిజాస్టర్ అవడం, ఆ వెంటనే రామ్ చరణ్ తో డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన గేమ్ చేంజర్ చిత్రం ప్లాప్ అవడం అన్ని ఇండియన్ 3పై అస్సలు హైప్ లేకుండా చేసాయి. 

Advertisement
CJ Advs

అయినప్పటికీ దర్శకుడు శంకర్ ఇండియన్ 3 వస్తుంది అనే చెబుతూ వచ్చారు. తాజాగా ఇండియన్ 3 పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారట, 70నుంచి 80 శాతం షూటింగ్ పూర్తి కావడంతో ఇండియన్ 3 ని థియేటర్స్ లోకి తెచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తుంది. మిగతా షూటింగ్ పూర్తి చెయ్యడానికి లైకా నిర్మాతలు కూడా సిద్దమయ్యాయట. 

ఇండియన్ 2, విడమయుర్చి దెబ్బకి లైకా వాళ్ళు దివాళా తీసారని టాక్ నడిచిన సందర్భంలో ఇండియన్ 3 మిగతా షూటింగ్ ని తక్కువ బడ్జెట్ లోనే పూర్తి చేసేయాలని శంకర్ కి కండిషన్ పెట్టడంతో శంకర్ కూడా ఇండియన్ 3 కి సంబందించిన కాస్ట్లీ వ్యవహారాలన్నీ పక్కన పెట్టేసినట్లుగా తెలుస్తుంది. 

కమల్ హాసన్ ఇచ్చే డేట్స్ చూసుకుని ఇండియన్ 3 రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. 

Indian 3 is getting ready:

Makers New Approach to Indian 3 Production
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs