గుండె సంబంధిత వ్యాధితో హైదరాబాద్ AIG ఆసుపత్రిలో జాయిన్ అయిన వైసీపీ మాజీ మంత్రి, మాజీ ఎమ్యెల్యే కొడాలి నాని కి AIG వైద్యులు మూడు వాల్స్ మూసుకుపోయాయి అని బైపాస్ సర్జరీని సూచించగా.. కుటుంబ సభ్యులు భయపడి ఆయనను ముంబై తరలించారు.
ముంబైలోని ఏషియన్ హార్ట్‌కేర్ ఇనిస్టిట్యూట్‌లో చీఫ్ సర్జన్ రమాకాంత్ పాండే ఆధ్వర్యంలో 8 గంటలపాటు శ్రమించి కొడాలి నానికి బైపాస్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసారు, దానితో కొడాలి నాని ఆరోగ్యం నెమ్మదిగా మెరుగవుతుంది అని వైద్యులు తెలిపారు, అయితే కొడాలి నాని కిడ్నీ ఫంక్షనింగ్, అలాగే మిగతా అవయవాలు అన్ని బాగానే పని చేస్తున్నాయని డాక్టర్స్ తెలిపారు.
కాకపోతే కొడాలి నాని మరికొన్నాళ్లు ఐసియు లోనే వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని, మరో నెల రోజులపాటు కొడాలి నాని ముంబైలోనే ఉంటారని తెలుస్తుంది.