Advertisement
Google Ads BL

ముందు ఫ్యాన్ మీట్ పెట్టండి సారూ


దేవర చిత్రం సమయంలో ఎన్టీఆర్ ఎలాంటి ఈవెంట్ లో కనిపించకపోవడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను చాలా అంటే చాలా డిజప్పాయింట్ చేసింది. దేవర సమయంలో ఓపెన్ ఈవెంట్స్ కి పర్మిషన్స్ దొరక్క ఎన్టీఆర్ ఫాన్స్ ను నేరుగా  కలవలేకపోయారు. ఆ తర్వాత దేవర సక్సెస్ సెలెబ్రేషన్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేసారు. అదీ అవ్వలేదు. 

Advertisement
CJ Advs

అప్పుడు ఎన్టీఆర్ నిరాశలో ఉన్న అభిమానులకో శుభవార్త వినిపించారు. అది తాను ఫ్యాన్స్ మీట్ పెట్టి ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవుతానని ప్రెస్ నోట్ వదిలారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను కలుస్తాను అనగానే అభిమానులు తెగ ఎగ్జైట్ అయ్యారు. అయితే ఎన్టీఆర్ కు ఇప్పటివరకు ఫ్యాన్స్ ను కలిసే అవకాశం రాలేదు. 

కానీ ఇప్పుడు ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ ను కలవకుండానే మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ కి హాజరు కాబోతున్నారు, మరోపక్క అన్న కళ్యాణ్ రామ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళబోతున్నారనే వార్తల నేపథ్యంలో ముందు మీ ఫ్యాన్ మీట్ నిర్వహించండి సారూ, తర్వాత వాళ్ళ కోసం వెలుదురు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్, మరి ఫ్యాన్స్ మనసులోనూ ఇదే ఉండొచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్ మీట్ కి టైమ్ సెట్ చేసి ప్రకటిస్తే అభిమానులు ఆ ఏర్పాట్లలో ఉంటారు.  

NTR Fan Meet update:

NTR To Grace Pre Release Event Of Arjun Son Of Vyjayanthi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs