మలయాళం హీరో కమ్ డైరెక్టర్ పృథ్వీ రాజ్ సుకుమారన్ మోహన్ లాల్‌తో లూసిఫర్‌ని తెరకెక్కిస్తే పాన్ ఇండియా భాషలన్నీ ఆ సినిమా వైపే చూశాయి. మెగాస్టార్ చిరు అయితే ఏకంగా గాడ్ ఫాదర్‌గా రీమేక్ కూడా చేశారు. అయినా జనాలు మలయాళ వెర్షన్‌ని ఓటీటీలో వీక్షించారు. అందుకే పృథ్వీరాజ్ ఈసారి లూసిఫర్‌ను L2ఎంపురాన్ అంటూ పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేశారు.
మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన L2ఎంపురాన్ పాన్ ఇండియా భాషల్లో వర్కౌట్ అవ్వలేదు అనే చెప్పాలి. మలయాళంలో ఓకే కానీ మిగతా లాంగ్వేజెస్‌లో ఈ సినిమాను ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు కాంట్రవర్సీ అయ్యాయి. అలాగే ఈ చిత్రానికి మిగతా లాంగ్వేజెస్ నుంచి వస్తోన్న ఫీడ్ బ్యాక్ చూసి ఎంపురాన్ సీక్వెల్ పార్ట్ 3 ఉండదేమో అని డౌట్ పడుతున్నారు.
కానీ లూసిఫర్ 3 ఉంటుందట. మలయాళంలో లూసిఫర్ ప్రాంచైజీ కొనసాగుతుంది అని ప్రకటించారు. మరి లూసిఫర్ 3ని మలయాళంలోనే తెరకెక్కిస్తారో, కాదు పాన్ ఇండియాలో కూడా రిలీజ్ చేస్తారో అనేలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపురాన్ పాన్ ఇండియాలో వర్కౌట్ అవ్వలేదు కాబట్టి లూసిఫర్ 3 ని పాన్ ఇండియాలో రిలీజ్ చేయరేమో అని నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.