Advertisement
Google Ads BL

అన్న-వదినతో MLC నాగబాబు


జనసేన పార్టీ పెట్టాక పదేళ్లకు ఎమ్యెల్యే గా గెలిచి మిత్రులు చంద్రబాబు, పీఎం మోడీల ను కలిసిన వెంటనే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా భార్యతో కలిసి అన్న-వదినలైన చిరు-సురేఖల దగ్గరకు వెళ్లి ఆశీర్వదం తీసుకుని, అమ్మతో దిష్టి తీయించుకున్న వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో చూసారు. 

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు ఎదురు చూసిన ఎమ్యెల్సీ పదవిని దక్కించుకుని నాగబాబు అను నేను అంటూ ప్రమాణం చేసి ఆ సాయంత్రానికి హైదరాబాద్ వచ్చి తన అన్నమెగాస్టార్ వదిన సురేఖలను కలిసిన పిక్స్ వైరల్ గా మారాయి. నాగబాబు ఎమ్యెల్సీగా జనసేన పార్టీ తరుపున గెలిచారు. ఇక ఇప్పుడు ఏపీ క్యాబినెట్ లో నాగబాబు కి మంత్రి పదవి దక్కుతుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. 

నాగబాబు అన్న ఆశీర్వాదం కోసం ఆయన ఇంటికి వెళ్లి అన్నవదిన లతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు, అంతేకాదు అన్న దగ్గర నుంచి పెన్ ని బహుమతిగా తీసుకున్నారు. అన్న చిరుని కలిసాక నాగబాబు సోషల్ మీడియా వేదికగా..  అన్నయ్యా.. మీ ప్రేమ, మద్దతుకు కృతజ్ఞుడిని. మీరు వదినతో కలిసి కానుకగా ఇచ్చిన పెన్ను నాకెంతో ప్రత్యేకం. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆ పెన్నునే ఉపయోగించడాన్ని ఎంతో గౌరవంగా భావించాను అంటూ ట్వీట్ చేసారు. 

MLC Nagababu with his brother and sister:

Chiranjeevi gifted a pen to Nagababu on becoming MLC
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs