అల్లు అర్జున్ రెండు వారాల క్రితమే దుబాయ్ వెళ్లారు. అక్కడ ఆయన పలు ప్రదేశాలతో పాటుగా అక్కడి గుడులను గోపురాలు సందర్శించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ వైరల్ అవుతూ ఉన్నాయి. అల్లు అర్జున్ ఫ్యామిలీ లేకుండానే దుబాయ్ లో సోలో ట్రిప్ వేసారు. ఆయన ఆద్యాత్మికతతో దుబాయ్ ట్రిప్ లో కనిపించారు.
దుబాయ్ లో లాంగ్ బ్రేక్ తీసుకుని ఫ్రెష్ ఆయిన్ అల్లు అర్జున్ నేడు హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్టైలిష్ గా కనిపించారు. ఎప్పుడూ అంటే పుష్ప 2 విడుదలకు ముందు ఏం చేసినా న్యూస్ లో నిలిచేలా పిఆర్ టీమ్ తో పబ్లిసిటీ చేయించుకునే అల్లు అర్జున్ ఈ దుబాయ్ ట్రిప్ లో అలాంటిదేం చెయ్యలేదు.
చాలా కామ్ గా సైలెంట్ గా దుబాయ్ ట్రిప్ ముగించేశారు. ఎయిర్ పోర్ట్ లోను ఆయన బ్లాక్ డ్రెస్ లో మాస్క్ పెట్టుకుని క్యాప్ తో కనిపించారు. ఇక ఏప్రిల్ 8 న ఆయన బర్త్ డే. మరి ఈ బర్త్ డే ని అల్లు అర్జున్ ఎలా ప్లాన్ చేస్తారో తెలియదు కానీ, ఆయన నుంచి రాబోయే సర్ ప్రైజ్ ల కోసం అల్లు అభిమానులు మాత్రం చాలా ఊహించేసుకుంటున్నారు.