భీష్మ చిత్రం సూపర్ హిట్ అవడంతో ఒక్కసారిగా వెంకీ కుడుముల పేరు మోగిపోయింది. భీష్మ తరవాత వెంకీ కుడుములు మెగాస్టార్ తో మూవీ చెయ్యడం కాదు మెగాస్టార్ వెంకీ కుడుముల తో జర్నీ చేయాలనుకున్నారు కానీ ఆ మూవీ పట్టాలెక్కకముందే నితిన్ తో మూవీ అనౌన్స్ చేసాడు వెంకీ కుడుములు.
భీష్మ త్రయం అంటే నితిన్-రష్మిక లతో వెంకీ మూవీ ఎనౌన్స్ చెయ్యడంతో ఆ మూవీపై అందరిలో విపరీతమైన ఆసక్తి స్టార్ట్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్ నుంచి సైలెంట్ గా రష్మిక తప్పుకోగా ఆ ప్లేస్ లోకి శ్రీలీల ఎంటర్ అవడం జరిగిపోయాయి. రాబిన్ హుడ్ టైటిల్ తో దేవి వార్నర్ ని గెస్ట్ గా తెచ్చి సినిమాని విడుదలకు రెడీ చెయ్యడమే కాదు అదిరిపోయే ప్రమోషన్స్ చేసారు.
కానీ రాబిన్ హుడ్ ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో మొదటిరోజు క్రిటిక్స్, ఆడియన్స్ యావరేజ్ టాక్, యావరేజ్ రివ్యూస్ ఇవ్వడంతో రాబిన్ హుడ్ ప్లాప్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ వీకెండ్ లోను రాబిన్ హుడ్ సత్తా చాటలేకపోవడం వెంకీ కుడుముల కెరీర్ కి మైనస్ గా మారింది. చిరు ని మెప్పించలేక చిరుతో సినిమా చెయ్యలేకపోయాను అన్న వెంకీ కి రాబిన్ హుడ్ రిజల్ట్ తర్వాత ఏ హీరో దొరుకుతాడో..
అసలు ఏ హీరో వెంకీ కుడుములు కు అవకాశం ఇస్తాడో అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎదైనా ప్రస్తుతం వెంకీ కుడుముల పరిస్థితి ఏమిటో అనేది కాస్త వేచి చూడాలి.