Advertisement
Google Ads BL

ఏప్రిల్ 4న అభయ గణపతి ఆలయాలకు పురాణపండచే అఖండ పూజార్చనలు

puranapanda srinivas | ఏప్రిల్ 4న అభయ గణపతి ఆలయాలకు పురాణపండచే అఖండ పూజార్చనలు

సికింద్రాబాద్, ఏప్రిల్ 2: జంటనగరాలలో ఇరవైఒక్క అభయ గణపతి ఆలయాల (Sri Abhayaganapthi Devalayam) నిర్మాణానికి రంగం సిద్ధమైంది. అతి అరుదైన కృష్ణశిలతో వివిధ ప్రాంతాల్లో నిర్మితమయ్యే ఈ ఆలయాలకు ప్రముఖ రచయిత, జ్ఞానమహాయజ్ఞ కేంద్రం సంస్థాపకులు పురాణపండ శ్రీనివాస్ (Puranapanda Srinivas) ఆలయనిర్మాణ పూజలు నిర్వహిస్తారు.

Advertisement
CJ Advs

ఇరవై ఒక్క ఆలయాల్లో మొదటిగా హైదరాబాద్ త్యాగరాయగానసభ (Tyagaraya Ganasabha)లో నిర్మితమైన అభయగణపతి ఆలయానికి శృంగేరి పండితుల వైదిక మంత్రశబ్దాలమధ్య ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ఏప్రిల్ 4న పూజార్చనలు నిర్వహిస్తారని త్యాగరాయగానసభ అధ్యక్షులు కళా జనార్ధనమూర్తి తెలిపారు.

రెండున్నర అడుగుల ఎత్తు, వెడల్పుతో, అరుదైన పవిత్ర కృష్ణ శిలతో ఈ అభయగణపతి శిల్పాన్ని తమిళనాడులో తయారు చేయించినట్లు జనార్ధనమూర్తి చెప్పారు.

వందల, వేల కళాకారులకు, రచయితలకు, నాట్యకారిణులకు, గాయనీ, గాయకులకు ముఖద్వారంగా సుమారు ఆరు దశాబ్దాల కీర్తిని జాతీయ స్థాయిలో మూట కట్టుకున్న త్యాగరాయగాన సభలో ఇలాంటి దైవీయ కార్యక్రమానికి తెరతీయడంపట్ల పలువురు హర్షం వెలిబుచ్చుతున్నారు.

ఈర్ష్యాసూయలు, కపటం, కల్మషాలు మన దగ్గరకి చేరనివ్వద్దని ప్రతీ సభలో అద్భుతమైన కథలతో హెచ్చరించే పురాణపండ శ్రీనివాస్ మానవ విలువలకు పెద్దపీట వేస్తారని తెలుగు రాష్ట్రాల్లో వేలకొలది భక్త రసజ్ఞులకు తెలుసున్న అంశమే! భారతీయ వైదిక, ధార్మిక అంశాలకు చెందిన పరమసత్యాల గ్రంధాలతో  దూసుకుపోతున్న పుస్తక మాంత్రికునిగా పురాణపండ శ్రీనివాస్ ఈ అభయ గణపతి మంగళ కార్యానికి హాజరవ్వడం గణపతి భగవానుని విశేష అనుగ్రహంగా మేధో సమాజం పేర్కొనడం గమనార్హం.  

ఈ అభయగణపతి ప్రతిష్టాపనలో తమను ప్రోత్సహించిన సీనియర్ ఐఏఎస్ అధికారి కేవి రమణాచారి, కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య (Bollineni Krishnaiah)  తదితరులకు జనార్ధనమూర్తి కృతజ్ఞతలు ప్రకటించారు.

Abhay Ganapathi Temples Construction to Begin with Puranapanda Srinivas Inaugural Pooja on April 4:

Puranapanda Srinivas to Lead the Inaugural Pooja at the New Abhay Ganapathi Temples in Hyderabad on April 4
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs