Advertisement
Google Ads BL

అసలైన మెగాస్టార్ ని బయటికి తెస్తాం - నాని


మెగాస్టార్ చిరు రాజకీయాలంటూ తొమ్మిదేళ్లు సినిమాకు బ్రేకిచ్చి మళ్ళీ ఖైదీ నెంబర్ 150 తో కమ్ బ్యాక్ ఇచ్చింది మొదలు.. ప్రతి ఒక్క దర్శకుడు ఆయన ఏజ్ ని పరిగణనలోకి తీసుకోకుండా, ఇంకా యంగ్ చిరు కి రాసిన కథలు రెడీ చేసి ఆయనతో సర్కస్ చేయిస్తున్నారనే అభిప్రాయం మెగా ఫ్యాన్స్ లోనే ఏర్పడింది. ఇప్పటికి డాన్స్, యాక్షన్ అంటూ చిరు వయసు తగ్గించే ప్రయత్నాల్లోనే ఉన్నారు. 

Advertisement
CJ Advs

అదే విషయాన్ని హీరో నాని ముక్కుసూటిగా చెబుతున్నారు. నాని ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ తో చెయ్యబోయే మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. నాని నిర్మాతగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరు హీరోగా మూవీ ప్లాన్ చేసి అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ చిత్రం పై నాని ఇంటర్వ్యూలో మాట్లాడారు. 

చిరంజీవి అనగానే డ్యాన్స్, యాక్షన్ మాత్రమే అని మనం ఒక అభిప్రాయానికి వచ్చేశాం.. కానీ మెగాస్టార్ అంటే అంతుకుమించి.. చిరంజీవి ని ప్రతి ఫ్యామిలీలో ఒక మెంబర్‌గా భావిస్తాం, ఆ విషయాన్ని మనం మర్చిపోయి వేరే దేనిపైనో ఫోకస్ చేస్తున్నాం, ఇప్పుడు శ్రీకాంత్ - చిరంజీవి కాంబో అనగానే అది చాలా సూపర్ కాంబో. 

చిరు-శ్రీకాంత్ కాంబో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది, ఈ చిత్రాన్ని నేను నిర్మిస్తున్నందుకు గాను చాలా గర్వ పడుతున్నా, నా జీవితం లో చిరంజీవి గారి లాంటి స్థాయి వ్యక్తిని పెట్టి నేను ఓ సినిమా తీస్తానని ఎప్పుడూ ఊహించలేదు.. కానీ అది అనుకోకుండా కుదిరింది, ఇది గొప్ప బాధ్యతగా భావిస్తున్నా ఖచ్చితంగా ది బెస్ట్ ఇస్తాం అంటూ నాని చిరు మూవీపై అప్ డేట్ ఇచ్చారు. 

Nani shares Chiranjeevi-Odela secrets:

Nani on Chiranjeevi-Srikanth Odela project
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs