కాంగ్రెస్ పార్టీ లో అందులోను వైఎస్ఆర్ ప్రభుత్వంలో కీలక పాత్ర వహించిన ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ర విభజన తర్వాత రాజకీయాల్లో లేకుండా అప్పుడప్పుడు ప్రస్తుత రాజకీయాలపై ఎనాలసిస్ చేస్తూ ఉంటారు. తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ పై అలాగే కూటమి ప్రభుత్వం పై జాఫర్ ఇంటర్వ్యూలో సన్సేషనల్ కామెంట్స్ చేసారు.
జగన్ ఏమిటండి అసంబ్లీకి వెళ్ళనంటాడు, గతంలో ఎన్టీఆర్ అసెంబ్లీకి వెళ్లలేదు, చంద్రబాబు నాయుడు అవమానం అంటూ అసెంబ్లీకి వెళ్ళలేదు, కానీ జగన్ ఏమిటండి తనకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్ళనంటాడు, అది కరెక్ట్ కాదు, తనకు అవమానం జరిగి అసెంబ్లీ నుంచి బయటికెళ్ళిపోతే ఓకె కానీ హోదా ఇవ్వనందుకు అసెంబ్లీకి వెళ్ళను అనడం అదేమన్నా తనకు ఫేవర్ అవుతుంది అనుకుంటునాడేమో అంటూ ఉండవల్లి జగన్ విషయంలో సెన్సేషనల్ కామెంట్స్ చేసారు.
అంతేకాదు షర్మిల-జగన్ ఆస్తి వివాదాలు రోజూ పేపర్ లో చూస్తున్నాం, అంత పెద్ద ఇంట్లో ఇలాంటి ఆర్థికపరమైన వివాదం జరగడం దురదృష్టకరం, అది మంచిది కాదు అంటూ షర్మిల-జగన్ వివాదంపై ఉండవల్లి స్పందించారు. ఇక కూటమి ప్రభుత్వం పై కామెంట్స్ చెయ్యమంటే.. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వంలో తప్పులను వేలెత్తి చూపించే విధంగా ఏమి జరగలేదు,.
కూటమి ప్రభుత్వాన్ని తప్పుబట్టానికి ఏమి లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం బానే ఉంది... ప్రస్తుతానికి ఈ ప్రభుత్వాన్ని కామెంట్ చెయ్యవలసి నంత సబ్జెక్ట్ నా దగ్గర లేదు అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.