చాలామంది కేసులకు భయపడడం, అధికారంలో లేని పార్టీలో ఎందుకు అని వైసీపీ పార్టీని వదిలిపోతున్నారు, నేను కానీ నా ఫ్యామిలీ కానీ కూటమి ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడము, కేసులకు భయపడి జగన్ మోహన్ రెడ్డిని, ఆయన పార్టీని వదలి వెళ్ళము, ఎప్పటికి జగన్ తోనే ఉంటాము అంటూ మాజీ మంత్రి పేర్ని నాని రెచ్చిపోయి మీడియా ముందు మట్లాడారు.
కానీ జగన్ దేవుడు, జగన్ రాముడు అని మాట్లాడిన చాలామంది వైసీపీ పార్టీకి బై బై చెప్పేసారు, ఇక నాని ఎంత అంటూ పేర్ని నాని కామెంట్స్ పై నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, లోకేష్, పవన్ లపై నోరేసుకుని పడిపోవడం కాదు, పవన్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా జుట్టుకు రంగేసుకుని తాడేపల్లి మీడియా మీట్ లో పాల్గొనే పేర్ని నాని ఇప్పుడు కూడా అదే పౌరుషాన్ని చూపిస్తున్నాడు.
వైసీపీ పార్టీ మాత్రమే కాదు ఎమ్యెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు, అప్పుడపుడు మీడియా ముందు హడావిడి చేస్తున్న పేర్ని నాని పై ఆయన భార్యపై కేసులు నమోదు అయ్యాయి.
తాజాగా నాని మట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎంత వేధించినా జగన్ ను, వైసీపీ పార్టీని వీడేది లేదు, ప్రజల ఓట్లు వేసి గెలిపిస్తే మంచి చేయాలి అనే ఆలోచన గాని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు.. అంటూ జగన్ పై స్వామి భక్తి చూపిస్తున్నాడు పేర్ని నాని.