కోలీవుడ్ దర్శకులు శంకర్, మురుగదాస్ అంటే యూత్ లో విపరీతమైన క్రేజ్, యూత్ ఏమిటి టాప్ దర్శకులు సైతం శంకర్ మేకింగ్ స్టైల్, మురగదాస్ టేకింగ్ కి ఫిదా అయ్యేవారు. శంకర్ భారతీయుడు లాంటి సినిమా చూస్తే మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్, మైండ్ బ్లోయింగ్ మేకింగ్. కానీ ఇప్పుడు ఇండియన్ 2, గేమ్ చేంజర్ చిత్రాలు చూసాక శంకర్ అవుట్ డేటెడ్ అయిపోయారు, ఆయన ప్రస్తుతం ట్రెండ్ కి సరిపోయే కథలు ఎంచుకుకోవడం లేదు అంటున్నారు.
మరొపక్క మురుగదాస్ కూడా స్పైడర్ తో మొదలైన ప్లాప్ ల పరంపర సికందర్ వరకు కొనసాగించారు. స్పైడర్, ఇంకా దర్భార్ చిత్రాలు ప్లాప్ అయ్యాక మురుగదాస్ కొన్నేళ్లు సమయం తీసుకుని సికందర్ స్క్రిప్ట్ రాసి బాలీవుడ్ బడా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ని ఒప్పించి మరీ రంగంలోకి దిగారు.
అందులోనూ ప్రస్తుతం హిందీ లో అద్భుతమైన విజయాలతో దూసుకుపోతున్న రశ్మికను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. కానీ సికందర్ విడుదలకు ముందు నుంచి ఎక్కడా బజ్ కనిపించలేదు. ట్రైలర్ కానీ, సాంగ్స్ కానీ ఏవి సినిమాపై బజ్ క్రియేట్ చేయలేకపోయాయి. నిన్న ఆదివారం ఉగాది, రంజాన్ స్పెషల్ గా విడుదలైన సికందర్ చిత్రానికి పూర్ రేటింగ్స్, పబ్లిక్ నుండి నెగెటివ్ టాక్ రావడం చూసి మురుగదాస్ సల్మాన్ భాయ్ ని ముంచేశాడు అంటూ సల్మాన్ అభిమానులు మురుగదాస్ పై ఫైర్ అవుతున్నారు.
అవుట్ డేటెడ్ స్క్రిప్ట్, అవుట్ డేటెడ్ దర్శకత్వం, పాటలు వీక్, చెత్త BGM , వీక్ స్టోరీ, ఓల్డ్ స్క్రీన్ ప్లే తో సికందర్ మూవీ నచ్చలేదు అంటూ ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్ వెకెండ్ తోనే సికందర్ దుకాణం సర్దేయడం ఖాయంగా కనబడుతుంది.
మరి శంకర్, మురుగదాస్ లు ఈ ట్రెండ్ కి తగ్గట్టుగా, యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా సినిమాలు చేస్తే ఇంకొన్నాళ్ళు పేక్షకుల్లో కనిపిస్తారు, లేదంటే.. లేదు.