టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్స్ అయినా, మీడియం రేంజ్ ప్రొడ్యూసర్స్ అయినా, క్రేజీ ప్రొడ్యూసర్స్ అయినా అందరిదీ ఒకదారి, నిర్మాత నాగవంశీది ఒక్కరిదే ఒకదారి, ఆయన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ప్రెస్ కి ప్రీమియర్ వెయ్యరు, రేటింగ్స్ ఇచ్చి సినిమాని కిల్ చేస్తారు రివ్యూ రైటర్స్ అని ఆయనకో నమ్మకం. కానీ మ్యాడ్ స్క్వేర్ కి సెంటిమెంట్ బ్రేక్ చేసి ప్రెస్ ప్రీమియర్స్ వేశారు.
మ్యాడ్ స్క్వేర్ కి సినీ విమర్శకులెవరూ సరైన రివ్యూ ఇవ్వలేదు అనేది నాగవంశీ వాదన. రేటింగ్స్ కానీ, రివ్యూస్ కాని ఒకరు ఇచ్చేది మాత్రమే, ఆయన ఓ 15 వందలమందిని కనుకున్ని రివ్యూ రాయరు, తన సొంత అభిప్రాయాన్ని రివ్యూ గా రాస్తారు, అందుకే రివ్యూ చూసి జనాలు థియేటర్స్ రారు, కంటెంట్ నచ్చితేనే వస్తారు అంటారు నాగవంశీ.
మ్యాడ్ స్క్వేర్ రివ్యూ రేటింగ్స్ విషయంలో తాజాగా నాగవంశీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సినిమా రిలీజ్ అయిన రోజు భార్య తిడితే ఆ కోపంతో చెత్త రివ్యూస్ రాసేవాళ్ళు ఉంటారు, నాకు రివ్యూ రైటర్స్ పై కోపం లేదు, మ్యాడ్ స్క్వేర్ విడుదలయిన రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టాం అక్కడ ఏ ఒక్కరూ రివ్యూస్ పై మాట్లాడలేదు.
కానీ ఆతర్వాత జరిగిన పరిణామాలే ఈరోజు నాతో ఇలా మాట్లాడించాయి. రివ్యూస్ చూసి జనాలు రారు, నా సినిమా నచ్చకపోతే చూడొద్దు, నా సినిమాలు బ్యాన్ చెయ్యండి, నా సినిమా కి పబ్లిసిటీ చెయ్యకండి, రివ్యూస్ రాయకండి, న్యూస్ లు పెట్టోద్దు, నా సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెల్సు.
నా సినిమా రిలీజ్ అయ్యాక ఏ ఒక్కరూ కలెక్షన్స్ బావున్నాయని రాయలేదు, నాకెలా ఉంటుంది. నేను మీతో గొడవ పెట్టుకోవడానికి రాలేదు, నాకు ఎవరి మీద పగ లేదు… కానీ ఇది ఇలానే కంటిన్యూ అయితే మా దారి మేం చూసుకుంటాం, మీ దారి మీరు చూసుకోండి అంటూ నాగ వంశీ తెగేసి చెప్పేసారు.