Advertisement
Google Ads BL

మిక్స్డ్ రివ్యూస్ అయినా వసూళ్ల మోత


ప్రేక్షకులకు సరైన సినిమా పడక చాలా బోరింగ్ గా ఫీల్ అవుతున్నారు. వరస సెలవలు, లాంగ్ వీకెండ్  కానీ ఎంజాయ్ చేసేందుకు, ఎంటర్టైన్ చేసేందుకు అద్భుతమైన సినిమాలు లేవు, భారీ బడ్జెట్ సినిమాలన్నీ సమ్మర్ నుంచి మొహం చాటేశాయి. అనుకున్న సమయానికి ఏవి థియేటర్స్ లోకి రావడం లేదు. 

Advertisement
CJ Advs

చిన్న సినిమా అయినా కాస్త టాక్ బావుంటే థియేటర్స్ కి జనాలు కదులుతున్నారు. మొన్నటికి మొన్న చిన్న సినిమా కోర్ట్ థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే.. ఇప్పుడు ఉగాది స్పెషల్ గా ఆడియెన్స్ ముందుకు వచ్చిన చిత్రం మ్యాడ్ స్క్వేర్ అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతుంది. హిట్ టాక్ తెచ్చుకున్న మ్యాడ్ స్క్వేర్ కలెక్షన్స్ పరంగా కొత్త నెంబర్లు నమోదు చెయ్యడం విశేషం.

నిర్మాతలు ముందు ఊహించినట్టుగానే మ్యాడ్ స్క్వేర్ కి క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. ఫస్ట్ హాఫ్ గోవా ఎపిసోడ్ బావున్నా, సెకండ్ హాఫ్ లో హాస్యం అంతంత మాత్రమే అంటూ సినీ విమర్శకులు తేల్చేసారు. కానీ మ్యాడ్ స్క్వేర్ ప్రేక్షకులు ఈ మాత్రమైనా ఉంటే చాలు అన్నట్టు, సూపర్ ఎంటర్టైనర్ గా కనెక్ట్ అవడంతో కలెక్షన్స్ వరదపారుతుంది. నిర్మాతలు కూడా మంచి ప్రొమోషన్ చెయ్యటం, ఎక్కడ చూసినా మ్యాడ్ స్క్వేర్ కామెడీ బిట్స్, రీల్స్ లతో మంచి టాక్ తెచ్చుకుంది. మ్యాడ్ స్క్వేర్ కు పోటి కూడా లేక పోవటంతో డిస్ట్రిబ్యూటర్స్ అందరూ హ్యాపీగా వున్నారు. ఇక నిర్మాత నాగవంశీ కి లాభాలే లాభాలు. 

మిక్స్డ్ రివ్యూస్ తో ఈ రేంజ్ కలెక్షన్స్ రావటం చూసి కంటెంట్ కు ప్రేక్షకులకు కనెక్ట్ అయితే కలెక్షన్స్ ని ఎవ్వరు ఆపలేరు అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. 

Despite mixed reviews, the collection is huge:

Mad Square box office collection
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs