Advertisement
Google Ads BL

కమెడియన్ అలీ ని టార్గెట్ చేసిన అన్వేష్


ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నా అన్వేషణ ద్వారా ఫేమస్ అయిన అన్వేష్, సినీ నటుడు అలీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. సహాయం పేరిట కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారని ముఖ్యంగా బిర్యానీ వీడియో ద్వారా ప్రజలను మోసం చేశారని ఆయన ఆరోపించారు. అలీ తన యూట్యూబ్ ఛానల్‌లో పెట్టిన కొన్ని వీడియోల వల్ల ప్రజలు తప్పుదారి పడే అవకాశం ఉందని వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

Advertisement
CJ Advs

కొంతకాలంగా బెట్టింగ్ యాప్‌ల వ్యతిరేకంగా పోరాడుతున్న అన్వేష్, అలీ కూడా ఒక బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తున్నారని ఆరోపించారు. వేల కోట్ల ఆస్తులున్న అలీ మరింత డబ్బు కోసం ఇలా తప్పుడు మార్గాలను ఎంచుకోవడం విచారకరమని అన్నారు. ఈ యాప్‌ల వల్ల సాధారణ ప్రజలు భారీగా నష్టపోతున్నారని చాలా మంది అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని పేర్కొన్నారు. కొంతమంది వ్యక్తులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు అని తెలిపారు.

అలీ తన భార్యతో కలిసి బిర్యానీ పంచిపెట్టిన వీడియో ద్వారా 50 లక్షల వ్యూస్ సాధించారని.. దాని ద్వారా రూ. 5 లక్షలు వరకు ఆదాయం పొందారని అన్వేష్ ఆరోపించారు. కేవలం రూ. 10 వేలు మాత్రమే ఖర్చు పెట్టి సహాయం పేరుతో ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. అంతేకాదు ఆ వీడియోలోనే బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించడం దారుణమని ఇది అసలు సేవా కార్యక్రమం కాదని.. కేవలం పబ్లిసిటీ కోసం చేసిన స్టంట్ మాత్రమే అని విమర్శించారు.

అన్వేష్ చెప్పిన ప్రకారం అలీ రంజాన్ మాసంలో కూడా బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించారని ఆరోపించారు. ఆ సమయంలో అన్వేష్ అలీకి ఈ విషయంలో మెసేజ్ పంపగా.. అలీ నుంచి దేవుడు ఎక్కడ బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించకూడదని చెప్పాడు..? అనే వివాదాస్పద సమాధానం వచ్చిందని అన్వేష్ వెల్లడించారు.

అన్వేష్ మాట్లాడుతూ.. ప్రజలకు సహాయం చేయకపోయినా కనీసం హాని చేయకూడదు అని అన్నారు. అలీ చేసిన ఈ పనుల వల్ల సాధారణ ప్రజలు డబ్బు కోల్పోయి రోడ్డున పడుతున్నారని.. ఈ తప్పుడు మార్గాలను వెంటనే అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల హక్కులను కాపాడటానికి తాను ఎప్పటికీ పోరాడతానని బెట్టింగ్ యాప్‌లను పూర్తిగా అరికట్టాలని పిలుపునిచ్చారు. దేశం నుంచి వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలిపోతున్నాయని.. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పుడు అలీ దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Anvesh targets comedian Ali:

Anvesh targets comedian Ali
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs