కొద్ది రోజుల క్రితం తీవ్ర ఆనారోగ్యానికి గురైన మాజీ మంత్రి కొడాలి నాని హుటాహుటిన హైదరాబాద్ లోని AIG ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. కొడాలి నానికి 5 రోజులుగా AIG ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గుండెకు సంబంధించి సమస్యతో బాధపడుతున్న కొడాలి నానికి మూడు వాల్స్ బ్లాక్ అయినట్లుగా వైద్యులు చెప్పినట్లుగా తెలుస్తోంది.
అయితే ఈరోజు సోమవారం కొడాలి నాని ని AIG హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఫ్యామిలీ మెంబెర్స్ అటునుంచి అటే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో ముంబైకి తరలిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఆయన కండిషన్ క్రిటికల్ గా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కొడాలి నానిని కుటుంబ సభ్యులు ముంబైకి తీసుకెళుతున్నారని సమాచారం.
కొద్ది సేపటి క్రితం కొడాలి నానిని ఎయిర్ అంబులెన్స్ లో కుటుంబ సభ్యులు ముంబై కు తరలింపు అంటూ ఛానల్ లో వస్తున్న వార్తలు చూసి ఆయన అభిమానులు అందోళన చెందుతున్నారు.