Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ కి ఇష్టమైన చైతు రెస్టారెంట్ ఫుడ్


హీరో నాగ చైతన్య షోయు అనే రెస్టారెంట్ ని ప్రారంభించాడు. అంతేకాదు తన భార్యతో కలిసి ఈ ఫుడ్ బిజినెస్ ని విస్తరించనున్నట్లుగా ప్రకటించిన రోజే నాగ చైతన్య రెస్టారెంట్ కి మంచి పబ్లిసిటీ దొరికింది. చైతు రెస్టారెంట్ పై ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ  వైరల్ అవుతున్నాయి. దేవర ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ జపాన్ వెళ్లారు. అక్కడ గత వారం రోజలుగా ఎన్టీఆర్ దేవరను ప్రమోట్ చెయ్యడమే కాదు జపాన్ అభిమానులతో తెగ సందడి చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

అక్కడ జపాన్ ఆడియన్స్ జపనీయుల కోసం హైదరాబాద్ లో ఉన్న మీ ఫేవరేట్ రెస్టారెంట్స్ ఏమిటి అని అడగగా.. నాకు సుషీ అనే జాపనీస్ ఫుడ్ చాలా ఇష్టం. సుషీ కోసం షోయు అనే రెస్టారెంట్ ను రికమెండ్ చేస్తాను. మై డియర్ ఫ్రెండ్, నా తోటి నటుడైన నాగచైతన్య షోయు రెస్టారెంట్ ఓనర్. ఇండియాలోనే బెస్ట్ జపనీస్ ఫుడ్ అక్కడ దొరుకుతుంది. ఫుడ్ అమేజింగ్ గా ఉంటుంది అని చెప్పారు. 

అంతేకాదు హైదరాబాద్ లో బెస్ట్ బిర్యానీ దొరుకుతుంది. షాదాబ్ అనే అనే ఓల్డెస్ట్ రెస్టారెంట్ లో బిర్యానీ చాలా బావుంటుంది. అంతేకాదు ట్రెడిషనల్ ఆంధ్రా ఫుడ్ కోసమైతే స్పైస్ వెన్యూ రెస్టారెంట్, అలాగే కాకతీయ డీలక్స్ మెస్.. ఇంకా తెలంగాణ రుచుల కోసం తెలంగాణ స్పైస్ కిచెన్, పాలమూరు గ్రిల్ రెస్టారెంట్స్ ను రికమెండ్ చేస్తాను. అక్కడ మంచి స్పైసీ ఫుడ్ తినొచ్చు అంటూ ఎన్టీఆర్ హైదరాబాద్ లోని టాప్ రెస్టారెంట్స్ గురించి జాపనీస్ తో పంచుకున్నారు. 

NTR recommends Naga Chaitanyas restaurant:

NTR Promotes Chaitanya restaurant
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs