వెబ్ ప్రపంచంలోనే అతిపెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ కి ఫ్రాంచైజీగా ఫ్యామిలీ 2 కూడా వచ్చింది, ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ 3 కూడా రాబోతుంది. రాజ్ అండ్ డీకే ద్వయం తెరకెక్కించిన ఫ్యామిలీ మ్యాన్ సీరీస్ లో మనోజ్ బాజ్ పాయ్ హీరో తరహా పాత్ర పోషిస్తే, సీజన్2 లో సమంత విలన్ గా కనిపించింది.
ఇక ఫ్యామిలీ మ్యాన్ 3 షూటింగ్ కూడా పూర్తయ్యింది. అది ఎప్పడు స్ట్రీమింగ్ అవుతుందో అనే ఆతృతలో ఓటీటీ ఆడియన్స్ ఉన్నారు. ఇక ఫ్యామిలీ మ్యాన్ 3 లో పాతాళ్‌లోక్-2లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న జైదీప్ అహ్లావత్ కూడా భాగమయ్యారు అనే విషయాన్ని మనోజ్ బాజ్ పాయ్ రివీల్ చేసారు. జైదీప్ అహ్లావత్ ఈ సీజన్ లో నెగెటివ్ రోల్ పోషిస్తున్నట్టుగా సమాచారం.
జైదీప్ అహ్లావత్ రెండేళ్ల క్రితమే ఈ సీరీస్ లో భాగమైనా ఈవిషయం బయటికి రాలేదు. సీజన్ 3 లో ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుంది, అంతకుమించి ఆయన కేరెక్టర్ పై ఇప్పుడే ఏమి చెప్పలేము. అంతేకాదు నవంబర్ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఫ్యామిలీ సీజన్ 3 స్ట్రీమింగ్ అవుతుంది అంటూ బిగ్ అప్ డేట్ అందించారు మనోజ్ బాజ్ పాయ్.