Advertisement
Google Ads BL

అల్లు అర్జున్-అట్లీ కాన్సెప్ట్ రివీల్డ్


అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశముందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement
CJ Advs

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఆసక్తికర సమాచారం బయటకొచ్చింది. పునర్జన్మ కాన్సెప్ట్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇది భారీ పీరియాడిక్ డ్రామాగా ముస్తాబవుతుందని.. కథలోని కొత్తతనం ప్రధాన ఆకర్షణగా ఉండనుందని అంటున్నారు.

ఈ కథ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఇందులో రెండు విభిన్నమైన గెటప్పుల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా.. చిత్రానికి ప్రధాన బలంగా ఉండేలా తీర్చిదిద్దినట్లు సమాచారం.

అంతేకాదు ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కి భారీ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. జూలై లేదా ఆగస్టు నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముందని.. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.

Allu Arjun-Atlee concept revealed:

Atlee-Allu Arjun Film On Reincarnation
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs