టాలీవుడ్ కి ఎప్పుడో దూరమైన రకుల్ ప్రీత్ సింగ్, తమిళ్ లోను ఇండియాన్ 2 తో ఘోరమైన డిజాస్టర్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం సౌత్ ప్రేక్షకులు రకుల్ ప్రీత్ ని ఆల్మోస్ట్ మరిచిపోయారు. ఇక రకుల్ కూడా హైదరాబాద్ రావడం తగ్గించేసింది. ఇక్కడ వ్యాపారాల కోసం అప్పుడప్పుడు వచ్చేది కానీ ఈమధ్యన అస్సలు కనిపించడం లేదు.
ముంబైలోనే బాలీవుడ్ నిర్మాతను పెళ్లి చేసుకుని సెటిల్ అయిన రకుల్ ప్రీత్ రీసెంట్ గానే తన పెళ్లి రోజుని మాల్దీవుల్లో సెలెబ్రేట్ చేసుకుంది. భర్త జాకీ భగ్నానీ తో అలాగే కుటుంబ సభ్యులతో కలిసి రకుల్ ప్రీత్ పెళ్లి రోజు వేడుకలను ఎంజాయ్ చేసింది.
ఇక సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ స్టయిల్ వేరు. గ్లామర్ ఫోటో షూట్స్ కి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. తాజాగా రకుల్ ప్రీత్ వదిలిన బెడ్ పిక్స్ మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రకుల్ ప్రీత్ బెడ్ పై పడుకుని ఆడుకుంటూ ఛిల్ అవుతున్న ఫొటోస్ అవి. అది చూసిన నెటిజెన్స్ బెడ్ పై రకుల్ ఆటలంటూ కామెంట్ చేస్తున్నారు.