Advertisement
Google Ads BL

పాన్ ఇండియా రేసులో మ‌హేష్ ఛాలెంజ్


బాహుబ‌లి ఫ్రాంఛైజీతో పాన్ ఇండియా రేస్ స్టార్ట్ చేసాడు ప్ర‌భాస్. బాహుబ‌లి, బాహుబ‌లి 2 చిత్రాలు అన్ని భాష‌ల్లోను అసాధార‌ణ వ‌సూళ్ల‌ను సాధించ‌డ‌మే గాక‌, ప్ర‌భాస్ రేంజును అమాంతం పెంచాయి. ఆ త‌ర్వాత క‌ల్కి 2898 ఎడి వ‌ర‌కూ ప్ర‌భాస్ పాన్ ఇండియా రేసింగ్ గురించి తెలిసిందే. రూ.1000 కోట్లు అంత‌కుమించి వ‌సూలు చేయ‌డం ప్ర‌భాస్‌కి ఇప్పుడు చాలా సులువు. అత‌డు పాన్ వ‌ర‌ల్డ్ స్టార్ గా త‌న‌ని తాను ఆవిష్క‌రించుకుంటున్నాడు.

Advertisement
CJ Advs

ప్ర‌భాస్ త‌ర్వాత పాన్ ఇండియా రేస్‌లోకి వ‌చ్చిన స్టార్లు చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మ‌హేష్‌. రాజ‌మౌళి తెర‌కెక్కించిన‌ ఆర్.ఆర్.ఆర్ చిత్రం చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ల‌ను పాన్ ఇండియ‌న్ స్టార్ల‌ను చేసింది. ఈ చిత్రం రూ.1000 కోట్ల క్ల‌బ్‌లో చేర‌డంతో ఆ త‌ర్వాత వ‌రుస‌గా పాన్ ఇండియా ల‌క్ష్యంగా ఈ ఇద్ద‌రు స్టార్లు ప్ర‌తిదీ ప్లాన్ చేస్తున్నారు. దేవ‌ర‌తో మ‌రో పాన్ ఇండియా విజ‌యం అందుకున్న ఎన్టీఆర్ త‌దుప‌రి వార్ 2తో స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే చరణ్ ని గేమ్ ఛేంజ‌ర్ చ‌ర‌ణ్ ని నిరాశ‌ప‌రిచింది. త‌దుప‌రి బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలోని స్పోర్ట్స్ డ్రామా- పెద్ది తో నిరూపించాల‌ని చ‌ర‌ణ్ పట్టుద‌ల‌గా ఉన్నాడు.

ఆర్.ఆర్.ఆర్ చిత్రం చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ల‌ను పాన్ ఇండియ‌న్ స్టార్ల‌ను చేయ‌గా, ఆ త‌ర్వాత సుకుమార్ తెర‌కెక్కించిన పుష్ప చిత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పాన్ ఇండియ‌న్ స్టార్‌ని చేసింది. పుష్ప 2 అసాధార‌ణ విజ‌యంతో అల్లు అర్జున్ రేంజ్ మ‌రో స్థాయికి చేరుకుంది. ఇటీవ‌లే విడుద‌లైన పుష్ప 2 చిత్రం దేశంలోని చాలా పాన్ ఇండియ‌న్ సినిమాల రికార్డుల‌ను బ‌ద్ధ‌లు కొట్టింది. దాదాపు రూ.1232 కోట్ల నెట్ (సుమారు 1800 కోట్ల గ్రాస్) వ‌సూళ్ల‌తో సంచ‌ల‌నం సృష్టించింది. బాహుబ‌లి 2, కేజీఎఫ్ 2, జ‌వాన్, ప‌ఠాన్ స‌హా చాలా పాన్ ఇండియా సినిమాల రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. 

ఇప్పుడు మ‌హేష్ వంతు. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ త‌న ఛామింగ్ లుక్స్ డ్యాషింగ్ ఎంపిక‌ల‌తో ఇప్ప‌టికే వేవ్స్ క్రియేట్ చేసాడు. రాజ‌మౌళితో అత‌డి ప్ర‌స్తుత చిత్రం SSMB29 పాన్ ఇండియా మార్కెట్లో త‌న స్థాయిని అమాంతం పెంచ‌నుంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఇప్ప‌టికే మొద‌లైంది. లీకుల భ‌యంతో క‌ఠిన ఆంక్ష‌ల న‌డుమ షూటింగ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దేశీ గాళ్ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌డంతో గ్లోబ‌ల్ మార్కెట్లో దీనిపై చ‌ర్చ సాగుతోంది. బాహుబ‌లి, ఆర్.ఆర్.ఆర్ చిత్రాల ద‌ర్శ‌కుడు రాజ‌మౌళితో మ‌హేష్ ప్ర‌య‌త్నం అజేయ‌మైన‌దిగా ఫ్యాన్స్ అభివ‌ర్ణిస్తున్నారు.

బాహుబ‌లి మొద‌లు పుష్ప 2 వ‌ర‌కూ టాలీవుడ్ స్టార్లు త‌మ స్టార్‌డ‌మ్‌ని పాన్ ఇండియా మార్కెట్లో విస్త‌రించారు. ఇప్పుడు మ‌హేష్ దీనిని త‌దుప‌రి స్థాయికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎస్.ఎస్.ఎం.బి 29 చిత్రాన్ని ఇండియ‌న్ డ‌యాస్పోరాతో పాటు, పాన్ వ‌ర‌ల్డ్ లో భారీగా రిలీజ్ చేయాల‌ని రాజ‌మౌళి టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాతో రూ.2000 కోట్ల నెట్ క్ల‌బ్‌(గ్రాస్ అంత‌కుమించి)లో మ‌హేష్‌ని చేర్చాల‌నేది ప్లాన్. దీనికోసం మ‌హేష్ అత‌డి టీమ్ చాలా హార్డ్ వ‌ర్క్ చేస్తున్నారు.

ఆ రేంజులో నిరూపించాలి:

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పుష్ప 2 థియేట్రిక‌ల్ రిలీజ్ లో 6.50 కోట్ల టికెట్ల‌ను సేల్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డును మ‌హేష్ బ్రేక్ చేయాల్సి ఉంటుంది. పుష్ప 2: ది రూల్ 6.50 కోట్ల టికెట్ల‌ను సేల్ చేయ‌గా, కెజిఎఫ్ చాప్టర్ 2  - 5.10 కోట్ల టికెట్ అమ్మ‌కాల‌తో ఆ త‌ర్వాతి స్థానంలో ఉంది. ఆర్ఆర్ఆర్ 4.50 కోట్ల టికెట్ల‌తో,  జవాన్ 3.80 కోట్ల టికెట్ సేల్ తో రికార్డుల‌కెక్క‌గా, కల్కి 2898 ఎడి 3.60 కోట్ల టికెట్ల అమ్మ‌కాల‌తో టాప్ 5 రేసులో నిలిచింది. వీటిన్నిటినీ మ‌హేష్ త‌న ఎస్.ఎస్.ఎం.బి 29తో అధిగ‌మించాల్సి ఉంది.

Mahesh challenge in the Pan India race:

Mahesh Babu needs to prove himself in that range
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs