Advertisement
Google Ads BL

సల్మాన్-SRKను అపార్ధం చేసుకున్నా-ఆమిర్


ఆమిర్ ఖాన్ కెరీర్‌లో అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచిన చిత్రం దంగల్. 2016లో విడుదలైన ఈ సినిమా భారతీయ సినీ రంగంలో ఓ మైలురాయిగా నిలిచింది. కానీ మొదట్లో ఈ సినిమాను అంగీకరించడానికి తాను సందిగ్ధంలో పడిపోయినట్టు ఆమిర్ వెల్లడించారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ వెనుక షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఉన్నారనే అపార్థం చేసుకున్నానని సరదాగా పేర్కొన్నారు.

Advertisement
CJ Advs

నేను సినిమాలను ఎంచుకునేటప్పుడు ట్రెండ్‌ కంటే ప్రేక్షకులకు నచ్చే కథలని మాత్రమే ప్రిఫర్ చేస్తాను. బాక్సాఫీస్ ఫలితాల కంటే మంచి కథలకు ప్రాధాన్యం ఇస్తాను. నా గత చిత్రాలైన లగాన్, దంగల్ సినిమాలు దీనికి నిదర్శనం. అయితే మొదట దంగల్ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ కలిసి నా కెరీర్‌కు ఆటంకం కలిగించేందుకు ఈ కథను పంపారని కొంత సమయం అపార్థం చేసుకున్నాను అని ఆమిర్ చెప్పుకొచ్చారు.

ఈ సినిమా కథను చదివిన తర్వాత నాకది చాలా పవర్‌ఫుల్ స్టోరీలా అనిపించింది. కానీ అప్పటికే నేను ధూమ్ 3 లో యంగ్ లుక్‌లో కనిపించినందున వెంటనే ఓ తండ్రి పాత్ర చేయడం సరైందా..? అనే ఆలోచన కలిగింది. కానీ దర్శకుడు నితీశ్ తివారీ మాత్రం ఈ పాత్రకు నేను మాత్రమే సరిపోతానని నమ్మకంగా చెప్పారు. అసలు అవసరమైతే నా కోసం 15 ఏళ్లు కూడా వేచి ఉంటానని చెప్పడంతో కథపై మరింత ఆసక్తి కలిగింది అని ఆమిర్ అన్నారు.

దంగల్ సినిమా ప్రసిద్ధ కుస్తీ క్రీడాకారుడు మహావీర్ ఫోగట్, అతని కుమార్తెల నిజజీవిత కథ ఆధారంగా రూపొందించబడింది. భారతదేశంలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా చైనా వంటి అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా సునామీలా రికార్డు కలెక్షన్లు సాధించింది. చైనా బాక్సాఫీస్‌ను శాసించిన కొద్ది భారతీయ సినిమాలలో ఇది ఒకటి.

ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. నేను నా కెరీర్‌ను మలుపు తిప్పే సినిమాలను ఎంచుకునే సమయంలో ఎప్పుడూ సాహసం చేస్తాను. స్క్రిప్ట్ నచ్చితే దాని ఫలితాన్ని గమనించకుండా ముందుకు సాగుతాను. దంగల్ నా కెరీర్‌లో అత్యుత్తమ నిర్ణయాలలో ఒకటి. ఈ సినిమా ద్వారా ఎంతో మంది ప్రేరణ పొందారు. ముఖ్యంగా మహిళా క్రీడాకారులు అని చెప్పారు.

దంగల్ విజయంతో ఆమిర్ ఖాన్ తన కెరీర్‌లో మరో అద్భుత విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఈ సినిమా స్ఫూర్తిదాయకమైన కథతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

Aamir says he misunderstood Salman-SRK:

Aamir Khan says he talked to Shah Rukh Khan-Salman Khan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs