కాజల్ అగర్వాల్ పెళ్లి, పిల్లలు తర్వాత ఆమె కెరీర్ అంతగా సాఫీగా సాగడం లేదు, కెరీర్ లో వరస సినిమాలు చేస్తుంది. కానీ సక్సెస్ మాత్రం రావడం లేదు. తాజాగా కాజల్ అగర్వాల్ సికిందర్ చిత్రంలో నటించింది. ఈచిత్రం ఆదివారం మార్చ్ 30 న విడుదల కాబోతుంది. ప్రస్తుతం టీమ్ సికిందర్ ప్రమోషన్స్ లో బిజీగా మారింది.
ఈ చిత్రంలో సల్మాన్ కి జోడిగా రష్మిక నటిస్తుంది. సల్మాన్ ఖాన్-రష్మిక మధ్య ఏజ్ గ్యాప్ పై సోషల్ మీడియాలో కనిపించిన న్యూస్ లపై సల్మాన్ కాస్త ఘాటుగానే స్పందించారు. రష్మిక కు నాకు 30 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉంది, అసలు రష్మిక కు లేని బాధ మీకెందుకు అంటూ సల్మాన్ ఖాన్ ఫైర్ అయ్యారు. ఆ ఈవెంట్లో రష్మిక, కాజల్ కూడా పాల్గొన్నారు.
కాజాల్ గర్వాల్ ఇప్పటికి గ్లామర్ గా అద్దరగొట్టడమే కాదు రశ్మికకు పోటీగా గ్లామర్ షో చేసింది. అయితే ఆ ఈవెంట్ లో రష్మిక మందన్న హడావిడి కనిపించింది. మీడియా కూడా రశ్మికనే ఎక్కువగా ఫోకస్ చేసింది. ఆ విషయాన్ని గమనించిన కాజల్ తాజాగా సోషల్ మీడియాలో తన లుక్స్ షేర్ చేసింది. ఈ ఏజ్ లోను కాజల్ గ్లామర్ గా సూపర్బ్ గా కనిపించింది.
ఇంకా కుర్ర హీరోయిన్స్ కి కాజల్ గట్టి పోటీ ఇస్తుంది అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి సికిందర్ గనక హిట్ అయితే కాజల్ టైంస్టార్ట్ అవుతుంది. చూద్దాం ఆమె లక్కు ఎలా ఉందొ అనేది.