కియారా అద్వానీ ఇప్పుడు ప్రెగ్నెంట్. ప్రస్తుతం ఆమె ఒప్పుకున్న సినిమా షూటింగ్స్ కొన్ని మధ్యలో ఉన్నాయి. ఒక బాలీవుడ్ బడా ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ మీదకి వెళ్లకపోవడంతో ఆమె ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. మరోపక్క కన్నడ పాన్ ఇండియా స్టార్ యష్ టాక్సిక్ లోను, వార్ 2 లోను కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.
వార్ 2 లో కియారా పాత్ర తాలూకు షూటింగ్ కంప్లీట్ అయ్యింది. యష్ టాక్సిక్ మాత్రం షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ప్రస్తుతం టాక్సిక్ కి సంబందించిన ముంబై షెడ్యూల్ మొదలయ్యింది. ఈ షెడ్యూల్ లో యష్ ఇంకా కియారా అద్వానీ లపై కీలక సన్నివేశాలను దర్శకురాలు గీతూ మోహన్ దాస్ షూట్ చేస్తున్నారట.
కియారా ఉన్న సన్నివేశాలను ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా ముగించేసేలా టాక్సిక్ టీమ్ ప్లాన్ చేసుకుంటుందట. ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఎప్పుడు షూటింగ్ కి ప్యాకప్ చెబుతుందో తెలియదు. అందుకే యాష్-కియారా రొమాంటిక్ సీన్స్ ని టాక్సిక్ టీమ్ త్వరగా చక్కబెట్టేస్తున్నట్టుగా తెలుస్తోంది.