Advertisement
Google Ads BL

వైసీపీ సపోర్ట్ ఉంది-రాజకీయాలు చేస్తారా


కూటమి ప్రభుత్వం రాకముందు వైసీపీ పార్టీలో చేరి జగన్ మెప్పు కోసం పవన్, చంద్రబాబు, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసి జగన్ నుంచి పదవి పొందిన సినీ నటుడు పోసాని కృష్ణమురళి, తన ఫ్యామిలీని టార్గెట్ చేసినందుకే తాను పవన్, బాబు, లోకేష్ లపై ఆ విధంగా మాట్లాడాను అన్నారు కానీ, ఆయన వైసీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అన్న విషయం పోసాని జైలుకెళ్లాక కానీ తేటతెల్లమవ్వలేదు. 

Advertisement
CJ Advs

సజ్జల రామకృష్ణ రెడ్డి పోసాని ఇంటికెళ్ళి మరీ స్క్రిప్ట్ ఇచ్చి పవన్, చంద్రబాబు, లోకేష్ లను తిట్టించారనేది పలు వీడియోస్ తో ద్వారా సోషల్ మీడియా లో స్పష్టమయ్యేలా టీడీపీ అభిమానులు చేసారు. ఇక పోసానిని అరెస్ట్ చెయ్యగానే వైసీపీ పార్టీ కాస్ట్లీ లాయర్ పొన్నవోలుని పోసాని కృష్ణమురళికి బెయిల్ ఇప్పించేందుకు పంపించాడు జగన్. 

పోసాని అరెస్ట్ అవ్వగానే ఆయన భార్యను జగన్ ఫోన్ లో పరామర్శించారు. మరోపక్క పోసాని బెయిల్ పై రాగానే అంబటి రాంబాబు రిసీవ్ చేసుకోవడం ఇదంతా పోసాని తమవాడే అని వైసీపీ  నేతలు, జగన్ చెప్పకనే చెప్పారు. మరి కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది అని భయపడి రాజకీయాలకు సెలవు తీసుకున్న పోసాని ఇప్పుడు వైసీపీ సపోర్ట్ తో రాజకీయాలు చేస్తారా.. 

తనని జైలు నుంచి బయటికి తేవడానికి కష్టపడ్డారు, వచ్చాక  వైసీపీ నేతలు సాదరంగా ఆహ్వానించి బాగా చూసుకున్నారు, మరి ఈ పరిణామాలతో పోసాని తిరిగి రాజకీయాలు చేస్తారో, మనకెందుకు గోల అని కామ్ గా ఉంటారో చూడాలి.  

YCP has support - will you do politics:

Will Posani continue to engage in politics
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs