నటుడు రాజేంద్ర ప్రసాద్ రాబిన్ హుడ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సరదాగా మాట్లాడిన మాటలు ఇప్పుడు సీరియస్ గా మారాయి. నితిన్-శ్రీలీల జంటగా, టాప్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ లో వెంకీ కుడుములు తెరకెక్కించిన రాబిన్ హుడ్ ఈ శుక్రవారం ఉగాది స్పెషల్ గా విడుదల కాబోతున్న తరుణంలో నటుడు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
రాబిన్ హుడ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డేవిడ్ వార్నర్ గురించి చాలా ఆత్మీయంగా మట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ నితిన్, వెంకీ కుడుముల కలిసి ఈ డేవిడ్ వార్నర్ ను రాబిన్ హుడ్ కోసం తీసుకొచ్చారు. అతడ్ని క్రికెట్ ఆడమంటే.. పుష్ప స్టెప్పులు వేస్తున్నాడు. ఈ దొంగ ము... కొడుకు, వీడు మాములోడు కాదండి. రేయ్ వార్నర్. నీకు ఇదే నా వార్నింగ్ అంటూ ఫ్లోలో ఏదో సరదాగా అనేసారు.
కానీ ఇప్పుడు ఆ సరదా మాటలే కొంతమంది తప్పుపడుతున్నారు. వార్నర్ అభిమానులైతే రాజేంద్ర ప్రసాద్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వార్నర్ కి నీ మాటలు అర్ధం కాకపోగా, ఆయన నవ్వారు, అదే అర్ధమైతే ఎలా ఉండేదో తెలుసా, రాజేంద్ర ప్రసాద్ ఏదో తాగి వాగాడులే అంటూ రాజేంద్ర ప్రసాద్ ని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు.